Skip to main content

భారత రాజ్యాంగం అంటే

ఓటు వజ్రాయుధం
ఒకే ఒక త్రిశూలం
ఓటు ఒక గాండీవం*
భారత రాజ్యాంగం అంటే 12 షెడ్యూళ్ళు 395 ఆర్టికల్స్ తో ఉన్న ఒక రూల్ బుక్ కాదు
రాజ్యాంగం అంటే ఒక నిత్య మార్గదర్శనం అందులోని ప్రతి అధ్యాయం భారతీయులకు భవిష్య నిర్దేశం చేసే ఒక భగవద్గీత
భారత రాజ్యాంగం లోని ప్రతి అక్షరం ప్రతి పేజీ పుడమిపై పుట్టిన ప్రతి ఒక్కరికి వేదవాక్కు అందులో ఉన్న ప్రతి వాక్యం ఆసేతు హిమాచలాన్ని ఒక్క తాటిపై నడిపించే శిలాశాసనం రాజ్యాంగంలోని ప్రతి అక్షరం పౌర హక్కులను కాపాడే అస్త్రం భారత దేశ ప్రగతికి బాటలు వేసే ఒక సత్యం ఉద్దేశం
ఇలా గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన నాటి నుంచి ఏడు దశాబ్దాలకు పైగా భారతదేశం అలుపెరగకుండా ముందుకు సాగుతూనే ఉంది
మొదటి ప్రధాని నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు ముందుకెళ్ళిన
ఆపై ఇందిరాగాంధీ గరీబీ హటావో అని నినదించిన
పీవీ హయాంలో సంస్కరణలకు తెరలేపిన
మన్మోహన్ సింగ్ ఆహారభద్రత ఉపాధిహామీ కల్పించిన
నేటి పాలకులు మేకిన్ ఇండియా అంటూ ప్రపంచ యాత్రలు చేస్తున్న
అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయింది
దేశంలో సంపద పెరుగుతుంటే దాన్ని మించి లాగా పేదరికం కూడా పెరుగుతుంది ఇప్పటికీ దేశంలో 30 శాతం మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు
దేశంలో 50 కోట్ల మందికి మరుగుదొడ్డి సదుపాయం లేదు దేశవ్యాప్తంగా ఆకలి కేకలు ప్రతిధ్వనించేలా వినిపిస్తూనే ఉన్నాయి అన్నార్తుల ఆర్తనాదాలు పెరుగుతున్న పేదరికం దిగజారుతున్న ఆర్థిక భారతం అవినీతి విశ్వరూపం పిచ్చి పెరుగుతున్న ఉగ్రవాదం దిగజారుతున్న శాంతిభద్రతలు పెరుగుతున్న అంతరాలు అట్టడుగున అన్నదాతలు అందలాలు సంపన్నులు ఆకాశాన నిత్యవసరాలు అమ్మాయిలపై అఘాయిత్యాలు ఇలా ఎటు చూసినా ఇటువంటి నీచ నికృష్ట మైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ప్రజాస్వామ్యం వికసించడం ఎలా???     ' మనకోసం మన రేపటి తరం కోసం

 విజ్ఞులైన ఓటరు లారా మేధావులారా ఆలోచించండి

 ప్రజల కోసం ప్రగతి కోసం మీకోసం నా చివరి రక్తపు బొట్టు ప్రాణాలు ధార పోస్తాం వాళ్ళు అయితే రాష్ట్రాన్ని దేశాన్ని అమ్మేస్తారు మేమైతే స్వర్ణాంధ్ర ఆదర్శ్ ఆంధ్ర బంగారు భారత్ నిర్మిస్తాం

 ఉచితంగా విద్యను ఉచితంగా సైకిళ్ళు చీరలు టీవీలు రుణమాఫీ

 ఇలా ఎంత  కాలం ఇలా మోసం దగా చేస్తారు ఎవడబ్బ సొమ్ము ఉచితంగా ఇవ్వడానికి

 ఇవన్నీ ఎలా చేస్తారు ఏ పార్టీ అయినా మేనిఫెస్టోలో చూపారా

 ఏ పార్టీ అయినా నేల గ్రస్తులకు సీటు ఇవ్వకుండా దూరంగా ఉంచిం దా?

 బడాబాబుల నాయకుల కొన్ని వేల లక్షల కోట్ల పన్ను రుణాల ఎగవేతలు కుంభకోణాలు ఎలా నివారిస్తారు ఏ పార్టీ అయినా  చెప్పిందా

 రాజకీయ నిరుద్యోగులు సమతల కోసం మంత్రి పదవులు కార్పొరేషన్ పదవులు సి పదవులు సృష్టించి సిగ్గులేకుండా వేల కోట్ల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం గురించి ఏ పార్టీ అయినా ఎప్పుడైనా ఆలోచించింది ఇవన్నీ ఇలాగే దశాబ్దాలుగా సాగిపోతున్నాయి

 ఇలాగే సాగిపోవా లా  పరిష్కారం  లేదా  ఉంది మన చేతుల్లోనే మనం మనం జనం జనం ప్రభంజనం అన్నట్లుగా ఓటును వజ్రాయుధంగా ఉపయోగిస్తే దేశంలో రాష్ట్రంలో అన్ని చోట్ల ప్రజలు ప్రజాస్వామ్యం  వికసించిన నాడు అన్ని సాధ్యమే

 కదలండి మార్పుకు నాంది పలకండి ఓటు వేయండి భవిష్యత్ తరాలకు ఉజ్వల భవిష్యత్తును కానుకగా అందించండి మన ఈనాటి   ఓటు  రేపటి ఉజ్వల భవిష్యత్తుకు నాంది

Comments

Popular posts from this blog

నా మాట

నా మాట   అమ్మ చూపించే అనురాగం   నా మాట నాన్న నుండి వచ్చే  బాధ్యత  నా మాట  గురువులు  ఇచ్చే జ్ఞానభోద  నా మాట  సమాజాన్ని చెక్కిన  శిల్పుల  నైపుణ్యత  నా మాట జాతిని నడిపిన  మహనీయుల మార్గం  నా మాట  ధర్మాన్ని చూపిన  ధర్మాత్ముల ప్రతిరూపం నా మాట పేదోడి కన్నీటి చుక్కల  ప్రతిబింబం  నా మాట  అభాగ్యుల ఆర్తనాదాల   అభిముఖం  నా మాట     భయస్తుడు డిక్కీ   ధైర్య గుళికల  సమూహం  నా మాట  ఓటమిలో ఓదార్పు   మంత్రాలను  అందించే  వేదం    నా మాట  గర్వానికి మొట్టికాయలు  వేసే  పిడికిలి  నా మాట  స్నేహితుడు చిలిపి చేష్టల  ఆనందోత్సవం  నా మాట అన్నతమ్ముల  ఆత్మీయ బంధం  నా మాట స్మశాన వైరాగ్యాలు   నా మాట జీవితాంతం తోడు ఉండే మీ ఆత్మ ఘోష లు  పాకలపాటి  అమర్  నాథ్

సుఖం .....సంతోషం

సుఖం .....సంతోషం సుఖంగా వుంటే సంతోషంగా వున్నట్టేనా? సుఖంగా వున్నప్పుడు అంత సంతోషమేనా? సుఖం ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇవ్వగలదా? ఆనందంగా వున్నామంటే సుఖంగావున్నట్టా? మనిషి కోరుకునేది సుఖంనా ? జీవితం ఎప్పుడు సుఖంగా వుంటే సరిపోతుందా? సుఖంగా వుండి ఆనందంగా వున్నామనే భ్రమలో బ్రతుకుతున్నామా? మనం అనుభవించ వలసిన ఆనందాన్ని సుఖం మత్తులో పడి ఇదే ఆనందం కాబోలు అనుకొని అలాగే బ్రతికేస్తున్నామా? చెట్టు కింద బ్రతికే వాళ్ళకి ఒక ఇల్లు, దానిలో ఒక ఫ్యాన్ ,దాని కింద నిద్రపోతే అది వాళ్ళకి సుఖంగా వున్నామని అనిపించొచ్చు ,అలాగే ఫ్యాన్ వున్నా వాళ్ళకి కూలర్ ...కూలర్ వున్నవాళ్ళకి ఏసి సుఖాన్ని ఇస్తుంది ....అల ఒకదాని తర్వాత ఒకటి జీవితం లో సమకూర్చుకుంటూ---- వాటి వెనకాల పడుతూ--- వాటిని సమకూర్చుకొనుటకు --డబ్బు సంపాదనే ధ్యేయంగా ఎంతో విలువైన సమయాన్ని కేవలం మనకు సుఖాన్నిచ్చే కొన్ని వస్తువల కోసం జీవితం లో అనుభవించవలసిన ఆనందాన్ని అంతా పోగొట్టుకుంటున్నాం .... ఇక్కడ డబ్బు సంపాదించటం దానివల్ల వచ్చే సుఖాన్ని వదిలేయమనటం కాదు నా ఉద్దేశం .... మనం రోజు చేసే పనుల్లో సాధించే విజయాలని పూర్తిగా ఆస్వాదిస్తూ ..అ ఆనందాన్ని అనుభవించే టైం మ...

NTR

తెలుగుజాతి ఆత్మగౌరవం, ఆరడుగుల అజనుబహుడు, శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, మహాశివుడు, దుర్యోధనుడు,రావణుడు, స్వామి వివేకానంద, శ్రీనాధా కవి సార్వభౌముడు,జమీందారు, కూలివాడిగా, రైతుగా, బడిపంతులుగా, ఇలా ఏ పాత్ర పోషించిన పాత్రకె వన్నె  తెచ్చే నటన మీ అభినయానికి చిహ్నం  ✍🏻పాకలపాటి అమర్ నాధ్✍🏻