Skip to main content

ఆచార్య శ్రీ బేతావోలు రామబ్రహ్మం గారికి రాష్టప్రతి పురస్కారం

ఆచార్య శ్రీ బేతావోలు రామబ్రహ్మం గారికి రాష్టప్రతి పురస్కారం వచ్చిన సందర్భంగా హార్ధిక శుభాకాంక్షలు.

బేతవోలు రామబ్రహ్మం గారు ప్రముఖ తెలుగు పండితులు, అవధాని, రచయిత మరియు విమర్శకులు.

బాల్యం / విద్యాభ్యాసం:- బేతావోలు రామబ్రహ్మం గారి ఒక అతి సామాన్య కుటుంబంలో తల్లిదండ్రులు శ్రీ బేతావోలు సత్యనారాయణ మూర్తి రాధ రుక్మిణీ వీరి తండ్రి గారు వృత్తి రీత్యా పశ్చిమ గోదావరి జిల్లా, నల్లజర్ల గ్రామంలో ఆర్&బి గుమస్తాగా పని చేయడం వల్ల వీరు నల్లజర్ల గ్రామంలో 1948, జూన్ 10 న జన్మించారు. కష్టాలే తోడుగా ఈయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. ఆ తర్వాత కొవ్వూరు సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ తెలుగు చదివారు. తరువాత నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య తూమాటి దొణప్ప పర్యవేక్షణలో తెలుగు వ్యాకరణాలపై సంస్కృత వ్యాకరణాల ప్రభావం అనే అంశంపై పి.హెచ్.డి చేశారు.

ఉద్యోగం:- మొట్టమొదట ఇతడు గుంటూరులోని కెవికె సంస్కృత కళాశాలలో ఉపన్యాసకులుగా చేరారు. ఈయన బోధన విద్యార్థులకే కాక సహ అధ్యాపకులైన మల్లంపల్లి వీరేశ్వరశర్మ , కోగంటి సీతారామచార్యులు, జమ్మలమడక మాధవరామశర్మ వంటి పండితులను కూడా ఆకర్షించేది. తరువాత ఈయన నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశారు. ఎన్‌.టి. రామారావు ముఖ్యమంత్రిగా ఒకరోజు నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన సందర్భంలో ఇతడి పద్యాలు విని అభినందిస్తూ… ‘మేం త్వరలో ఏర్పాటు చేయబోయే తెలుగువిశ్వవిద్యాలయానికి మీ వంటి వారు అవసరం. త్వరలో మనం తప్పకుండా కలుద్దాం’ అని అన్నాడు. దాంతో రామారావు ప్రత్యేకంగా కళలకు సంబంధించి తెలుగు విశ్వ విద్యాలయం స్థాపించడం, రాజమండ్రి వద్దనున్న బొమ్మూరు కేంద్రంగా సాహిత్య పీఠాన్ని ఏర్పాటు చేయడం, అక్కడికి ఈయన్ని ఆచార్యులుగా తీసుకోవడం జరిగింది. అక్కడ తెలుగు సాహిత్య అధ్యయనం రూపకల్పనలోనూ, పరిశోధన విషయంలోనూ ఇతడు పెనుమూర్పులు తీసుకువచ్చి భావితరాలకు మార్గదర్శకత్వం వహించడంలో కీలకపాత్ర పోషించారు. ‘భారతి’ లేని లోటును తీర్చిన ‘వాజ్ఞ్మయి’ త్రైమాసిక పత్రిక పేరు ఈయన సూచించిందే. హైదరాబాద్‌లో ప్రారంభమై ఏడాది పాటు నడిచిన ఆ పత్రికను బొమ్మూరుకు తీసుకెళ్ళి పరిశోధనలో ప్రామాణికతను పాటిస్తూ తెలుగు సాహిత్యానికి విశిష్టమైన సంచికగా రూపొందించడంలో కీలకంగా నిలిచారు. ఈయన మార్గదర్శకత్వంలో పాతికమంది వరకు పీహెచ్‌డీలు చేసి డిగ్రీలు పొందారు.
2005లో హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా చేరారు.
వర్ణన రత్నాకరానికి 23 సంపుటలా వ్యాఖ్యానం వీరి ఇటీవలి పెద్ద కృషి. ఇంకా చాలా కావ్యవ్యాఖ్యానాలున్నాయి.
సాహిత్య రంగం:-రావూరి వెంకటేశ్వర్లు ప్రోత్సాహంతో, ప్రేరణతో భాషాప్రవీణ రెండవ సంవత్సరం చదివేప్పుడే అవధానాల వైపు ఆకర్షితుడై పద్ధెనిమిదేళ్ల కే ( 1967లో)నవరాత్రి ఉత్సవాలకు మొదటి అవధానం చేశారు. దాదాపు పాతిక సంవత్సరాల్లో 300 వరకు అవధానాలు చేసి తెలుగు ప్రజల హృదయాలను దోచుకున్నారు. తర్వాత లెక్కలేనన్ని అవధాన సభలకు సంచాలకత్వం వహించారు. కొవ్వూరు సంస్కృత కళాశాల నుంచి వెలువడే ‘గౌతమి’ మాసపత్రికకు ఒక్క సంవత్సరం పాటు సంపాదకులుగా వ్యవహరించి అంతవరకు గ్రాంథికంలో వెలువడుతున్న ఆ పత్రికను పూర్తిగా వ్యవహారంలోకి తెచ్చిన ఘనత ఈయనకే దక్కుతుంది. ఆ పత్రికలో ఇతను ‘జయసింహ చరిత్ర’ ( కల్పిత కథా ప్రబంధం) అన్న శీర్షికతో సరళ శైలిలో పద్యాలు వ్రాశారు.

ఒకసారి నాగార్జున విశ్వవిద్యాయలంలో బుద్ధిస్ట్ స్టడీస్ కేంద్రాన్ని ప్రారంభిచడానికి భూటాన్ దేశపు మఠాధిపతి జె.కంపూ, వారి బృందం వచ్చారు. వారితోపాటు అప్పటి మన ఉపరాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్, యూజీసీ వైస్ చైర్మన్ ఆచార్య కొత్త సచ్చిదానంద మూర్తి కూడా వచ్చారు. ప్రారంభోత్సవం అయ్యాక సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బేతవోలు రామబ్రహ్మం గారు రాసిన ‘సౌందర నందం’ నాటకాన్ని ఆ భూటాన్ మఠాధిపతి, బృందం సభ్యులు నిల్చొనే తిలకించారు. నాటకం అయ్యాక బుద్ధుడి భిక్షాపాత్రని డాలర్లతో నింపి, రచయితను అభినందించి, ఆ ఆనందంలో మీరంతా మా దేశం వచ్చి పలుచోట్ల ప్రదర్శనలు ఇవ్వమన్నారు. దాంతో ఈయన భూటాన్ వెళ్ళి అక్కడ ‘ఉన్మత్త యక్షరాజం, సౌందరనందం’ వంటి బౌద్ధ సంబంధి నాటక ప్రదర్శనలు ఇప్పించి, అక్కడివారి ఆదరాభిమానాలను చూరగొన్నారు. ఇలా ఇతడు తన రచనల ద్వారా విదేశీయులను సైతం ఆకర్షించారు.

బొమ్మూరు విశ్వవిద్యాలయం తరపున ఒకసారి ‘వచన కవితకు షష్టిపూర్తి’ అన్న శీర్షికతో కవి సమ్మేళనాలు, సభలు నిర్వహించారు. తరువాత హైదరాబాదులో ‘ఆంధ్ర పద్య కవితా సదస్సు’ నిర్వహించి నండూరి రామకృష్ణమాచార్యులు అధ్యక్షలుగా, ఈయన ఉపాధ్యక్షులుగా రాష్ట్రం నలుదిశలా పర్యటించి పద్యం విశిష్టతను తెలిపారు. ఈయన కొత్త గోదావరి వంటి పద్య కావ్యాలే కాకుండా నాటకాలూ వ్రాశారు. కథలు వ్రాశారు. అనువాద రచనలు వ్రాశారు. సాహిత్య వ్యాసాలు, పరిశోధనా గ్రంథాలు వ్రాశారు. అన్నింటికన్నా సంస్కృత నాటకాలకు వ్యాఖ్యానాలు రాసి ఎనలేని కీర్తి గడించారు. దేవీ భాగవతం వచన రచన ద్వారా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. తొలినాళ్ళలో నాస్తిక భావాలున్న ఈయనకి ఆధ్యాత్మిక దిగ్ధర్శకత్వం నెరపినవారు లక్ష్మణ యతీంద్రులు. ఈయనకి దిశానిర్దేశం చేసి ఆచార్యునిగా తీర్చినది ఆచార్య తూమాటి దొణప్ప.

రచనలు:-
వ్యాసగౌతమి
వ్యాసపీఠిక
పద్యకవితా పరిచయం
శ్రీ మద్రామాయణము (తెలుగు వచనము యథాతథము)
వాల్మీకి రామాయణము
శ్రీదేవీ భాగవతము
శూద్రక మహాకవి మృచ్ఛకటికం
భట్ట నారాయణస్య వేణిసంహారం
శ్రీహర్షుడు నాగానందం
తెలుగు వ్యాకరణాలపై సంస్కృత ప్రాకృత వ్యాకరణాల ప్రభావం
క్రొత్త గోదావరి
పలుకు చిలుక
శకుంతలాదుష్యంతం
అనర్ఘ రాఘవం

బిరుదములు:-
అవధాన సుధాకర
సభా సంచాలక సార్వభౌమ

Comments

Popular posts from this blog

నా మాట

నా మాట   అమ్మ చూపించే అనురాగం   నా మాట నాన్న నుండి వచ్చే  బాధ్యత  నా మాట  గురువులు  ఇచ్చే జ్ఞానభోద  నా మాట  సమాజాన్ని చెక్కిన  శిల్పుల  నైపుణ్యత  నా మాట జాతిని నడిపిన  మహనీయుల మార్గం  నా మాట  ధర్మాన్ని చూపిన  ధర్మాత్ముల ప్రతిరూపం నా మాట పేదోడి కన్నీటి చుక్కల  ప్రతిబింబం  నా మాట  అభాగ్యుల ఆర్తనాదాల   అభిముఖం  నా మాట     భయస్తుడు డిక్కీ   ధైర్య గుళికల  సమూహం  నా మాట  ఓటమిలో ఓదార్పు   మంత్రాలను  అందించే  వేదం    నా మాట  గర్వానికి మొట్టికాయలు  వేసే  పిడికిలి  నా మాట  స్నేహితుడు చిలిపి చేష్టల  ఆనందోత్సవం  నా మాట అన్నతమ్ముల  ఆత్మీయ బంధం  నా మాట స్మశాన వైరాగ్యాలు   నా మాట జీవితాంతం తోడు ఉండే మీ ఆత్మ ఘోష లు  పాకలపాటి  అమర్  నాథ్

సుఖం .....సంతోషం

సుఖం .....సంతోషం సుఖంగా వుంటే సంతోషంగా వున్నట్టేనా? సుఖంగా వున్నప్పుడు అంత సంతోషమేనా? సుఖం ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇవ్వగలదా? ఆనందంగా వున్నామంటే సుఖంగావున్నట్టా? మనిషి కోరుకునేది సుఖంనా ? జీవితం ఎప్పుడు సుఖంగా వుంటే సరిపోతుందా? సుఖంగా వుండి ఆనందంగా వున్నామనే భ్రమలో బ్రతుకుతున్నామా? మనం అనుభవించ వలసిన ఆనందాన్ని సుఖం మత్తులో పడి ఇదే ఆనందం కాబోలు అనుకొని అలాగే బ్రతికేస్తున్నామా? చెట్టు కింద బ్రతికే వాళ్ళకి ఒక ఇల్లు, దానిలో ఒక ఫ్యాన్ ,దాని కింద నిద్రపోతే అది వాళ్ళకి సుఖంగా వున్నామని అనిపించొచ్చు ,అలాగే ఫ్యాన్ వున్నా వాళ్ళకి కూలర్ ...కూలర్ వున్నవాళ్ళకి ఏసి సుఖాన్ని ఇస్తుంది ....అల ఒకదాని తర్వాత ఒకటి జీవితం లో సమకూర్చుకుంటూ---- వాటి వెనకాల పడుతూ--- వాటిని సమకూర్చుకొనుటకు --డబ్బు సంపాదనే ధ్యేయంగా ఎంతో విలువైన సమయాన్ని కేవలం మనకు సుఖాన్నిచ్చే కొన్ని వస్తువల కోసం జీవితం లో అనుభవించవలసిన ఆనందాన్ని అంతా పోగొట్టుకుంటున్నాం .... ఇక్కడ డబ్బు సంపాదించటం దానివల్ల వచ్చే సుఖాన్ని వదిలేయమనటం కాదు నా ఉద్దేశం .... మనం రోజు చేసే పనుల్లో సాధించే విజయాలని పూర్తిగా ఆస్వాదిస్తూ ..అ ఆనందాన్ని అనుభవించే టైం మ...

NTR

తెలుగుజాతి ఆత్మగౌరవం, ఆరడుగుల అజనుబహుడు, శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, మహాశివుడు, దుర్యోధనుడు,రావణుడు, స్వామి వివేకానంద, శ్రీనాధా కవి సార్వభౌముడు,జమీందారు, కూలివాడిగా, రైతుగా, బడిపంతులుగా, ఇలా ఏ పాత్ర పోషించిన పాత్రకె వన్నె  తెచ్చే నటన మీ అభినయానికి చిహ్నం  ✍🏻పాకలపాటి అమర్ నాధ్✍🏻