Skip to main content

ఆధ్యాత్మిక పరిపక్వత ఏమిటి?

🌷ఆధ్యాత్మిక                                                                                                                   పరిపక్వత🌷

🌴🌴🌴🌴🌴🌴
ఆధ్యాత్మిక పరిపక్వత ఏమిటి?
🌴🌴🌴🌴🌴🌴🌴

🌷1. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే   
  మీరు ఇతరులను మార్చాలనే ప్రయత్నం  మాని మీరు మారడంపై దృష్టి పెట్టడం .

🌷2. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే
  మీరు ప్రజలను వారు ఉన్నవిధంగా అంగీకరించడం .

🌷3. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే
ప్రతిఒక్కరు చేసేది వారి స్వంత దృష్టికోణంలో సరియైనదేనని భావించడాన్ని నేర్చుకోవడం .

🌷4. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే
మీరు  జరుగనున్నది సంఘర్షణ పడక జరగనివ్వడాన్ని నేర్చుకోవడం .

🌷5. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే
 మీరు ఇతరులతో సంబంధాలు నెరిపేటప్పుడు , వారినుండి ఏమీ ఆశించకుండా , మీరు ఇవ్వడం నేర్చు కోవడం .

🌷6. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే
మీరు చేసే పనులన్నీ మీ స్వీయ శాంతి కొరకే అని అర్ధం చేసుకోవడం .

🌷7. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే
మీరు ప్రపంచానికి తెలివైనవారిగా నిరూపించే ప్రయత్నాలను మాని వేయడం .

🌷8. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే
    ఇతరులు నీచర్యలను సర్వత్రా ఆమోదించాలని ఆశించకూడదని నేర్చుకోవడం .

🌷9. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే
మీరు ఇతరులతో పోల్చుకోవడాన్ని మాని వేయడం .

🌷10. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే మీ అంతరంగంతో మీరు శాంతితో మనుగడ సాగించడం .

🌷11. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే
మీరు "అవసరానికి" మరియు “కోరికలకు " ​​మధ్య బేధమెరిగి ఉండి ,మీ  “కోరికలను వదలివేయడం .

🌷12.  ఆధ్యాత్మిక పరిపక్వత అంటే
మీరు భౌతిక విషయాలలోని సంతోషంతో అనుబంధాన్ని  వదలి వేయడం .

💐 "మీరందరూ ఆధ్యాత్మికంగా పరిపక్వత గల జీవితాలు గడపి మీ జీవితాలు ధన్యం చేసుకోలరని ఆశిస్తున్నాము .  

సర్వే జనా సుఖినోభవంతు 🙏

Comments

Popular posts from this blog

నా మాట

నా మాట   అమ్మ చూపించే అనురాగం   నా మాట నాన్న నుండి వచ్చే  బాధ్యత  నా మాట  గురువులు  ఇచ్చే జ్ఞానభోద  నా మాట  సమాజాన్ని చెక్కిన  శిల్పుల  నైపుణ్యత  నా మాట జాతిని నడిపిన  మహనీయుల మార్గం  నా మాట  ధర్మాన్ని చూపిన  ధర్మాత్ముల ప్రతిరూపం నా మాట పేదోడి కన్నీటి చుక్కల  ప్రతిబింబం  నా మాట  అభాగ్యుల ఆర్తనాదాల   అభిముఖం  నా మాట     భయస్తుడు డిక్కీ   ధైర్య గుళికల  సమూహం  నా మాట  ఓటమిలో ఓదార్పు   మంత్రాలను  అందించే  వేదం    నా మాట  గర్వానికి మొట్టికాయలు  వేసే  పిడికిలి  నా మాట  స్నేహితుడు చిలిపి చేష్టల  ఆనందోత్సవం  నా మాట అన్నతమ్ముల  ఆత్మీయ బంధం  నా మాట స్మశాన వైరాగ్యాలు   నా మాట జీవితాంతం తోడు ఉండే మీ ఆత్మ ఘోష లు  పాకలపాటి  అమర్  నాథ్

సుఖం .....సంతోషం

సుఖం .....సంతోషం సుఖంగా వుంటే సంతోషంగా వున్నట్టేనా? సుఖంగా వున్నప్పుడు అంత సంతోషమేనా? సుఖం ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇవ్వగలదా? ఆనందంగా వున్నామంటే సుఖంగావున్నట్టా? మనిషి కోరుకునేది సుఖంనా ? జీవితం ఎప్పుడు సుఖంగా వుంటే సరిపోతుందా? సుఖంగా వుండి ఆనందంగా వున్నామనే భ్రమలో బ్రతుకుతున్నామా? మనం అనుభవించ వలసిన ఆనందాన్ని సుఖం మత్తులో పడి ఇదే ఆనందం కాబోలు అనుకొని అలాగే బ్రతికేస్తున్నామా? చెట్టు కింద బ్రతికే వాళ్ళకి ఒక ఇల్లు, దానిలో ఒక ఫ్యాన్ ,దాని కింద నిద్రపోతే అది వాళ్ళకి సుఖంగా వున్నామని అనిపించొచ్చు ,అలాగే ఫ్యాన్ వున్నా వాళ్ళకి కూలర్ ...కూలర్ వున్నవాళ్ళకి ఏసి సుఖాన్ని ఇస్తుంది ....అల ఒకదాని తర్వాత ఒకటి జీవితం లో సమకూర్చుకుంటూ---- వాటి వెనకాల పడుతూ--- వాటిని సమకూర్చుకొనుటకు --డబ్బు సంపాదనే ధ్యేయంగా ఎంతో విలువైన సమయాన్ని కేవలం మనకు సుఖాన్నిచ్చే కొన్ని వస్తువల కోసం జీవితం లో అనుభవించవలసిన ఆనందాన్ని అంతా పోగొట్టుకుంటున్నాం .... ఇక్కడ డబ్బు సంపాదించటం దానివల్ల వచ్చే సుఖాన్ని వదిలేయమనటం కాదు నా ఉద్దేశం .... మనం రోజు చేసే పనుల్లో సాధించే విజయాలని పూర్తిగా ఆస్వాదిస్తూ ..అ ఆనందాన్ని అనుభవించే టైం మ...

NTR

తెలుగుజాతి ఆత్మగౌరవం, ఆరడుగుల అజనుబహుడు, శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, మహాశివుడు, దుర్యోధనుడు,రావణుడు, స్వామి వివేకానంద, శ్రీనాధా కవి సార్వభౌముడు,జమీందారు, కూలివాడిగా, రైతుగా, బడిపంతులుగా, ఇలా ఏ పాత్ర పోషించిన పాత్రకె వన్నె  తెచ్చే నటన మీ అభినయానికి చిహ్నం  ✍🏻పాకలపాటి అమర్ నాధ్✍🏻