Skip to main content

సుఖం .....సంతోషం

సుఖం .....సంతోషం

సుఖంగా వుంటే సంతోషంగా వున్నట్టేనా?
సుఖంగా వున్నప్పుడు అంత సంతోషమేనా?
సుఖం ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇవ్వగలదా?
ఆనందంగా వున్నామంటే సుఖంగావున్నట్టా?
మనిషి కోరుకునేది సుఖంనా ? జీవితం ఎప్పుడు సుఖంగా వుంటే సరిపోతుందా? సుఖంగా వుండి ఆనందంగా వున్నామనే భ్రమలో బ్రతుకుతున్నామా?
మనం అనుభవించ వలసిన ఆనందాన్ని సుఖం మత్తులో పడి ఇదే ఆనందం కాబోలు అనుకొని అలాగే బ్రతికేస్తున్నామా?

చెట్టు కింద బ్రతికే వాళ్ళకి ఒక ఇల్లు, దానిలో ఒక ఫ్యాన్ ,దాని కింద నిద్రపోతే అది వాళ్ళకి సుఖంగా వున్నామని అనిపించొచ్చు ,అలాగే ఫ్యాన్ వున్నా వాళ్ళకి కూలర్ ...కూలర్ వున్నవాళ్ళకి ఏసి సుఖాన్ని ఇస్తుంది ....అల ఒకదాని తర్వాత ఒకటి జీవితం లో సమకూర్చుకుంటూ---- వాటి వెనకాల పడుతూ--- వాటిని సమకూర్చుకొనుటకు --డబ్బు సంపాదనే ధ్యేయంగా ఎంతో విలువైన సమయాన్ని కేవలం మనకు సుఖాన్నిచ్చే కొన్ని వస్తువల కోసం జీవితం లో అనుభవించవలసిన ఆనందాన్ని అంతా పోగొట్టుకుంటున్నాం ....
ఇక్కడ డబ్బు సంపాదించటం దానివల్ల వచ్చే సుఖాన్ని వదిలేయమనటం కాదు నా ఉద్దేశం ....

మనం రోజు చేసే పనుల్లో సాధించే విజయాలని పూర్తిగా ఆస్వాదిస్తూ ..అ ఆనందాన్ని అనుభవించే టైం మన మనసుకు కల్పించ గలగాలి .. సుఖం ఎప్పుడు భౌతికమయినది ..భౌతిక శరీరాన్ని కష్టపెట్టకుండా చూసుకోవడమే సుఖపడటం .... జీవితం లో సుఖానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇవ్వాలి ..కాని మన మనుసుకి ఉత్తేజాన్ని ఇచ్చే సంతోషాన్ని అణగద్రోక్కెంతగా ఇవ్వకూడదు ...భౌతిక శరీరానికి ఎప్పుడు సుఖం అవసరమే ..అల చేయని యెడల పాపం కూడా హిందూ ధర్మ ప్రకారం .

సుఖం గ వున్నప్పుడే కదా ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదిన్చగలం అని అనుకోవచ్చు ...పూర్వం చాల మంది మునులు మరియు ఋషులు,,,, ఎ సుఖాన్ని అనుభవించారు ...వాళ్ళు ఎప్పుడు మానసిక ఆనందాన్ని మాత్రమే కోరుకునే వారు అందుకే వాళ్ళు ఎక్కడ అయిన ఎన్ని ఏళ్ళు అయిన నిద్రాహారాలు మాని మానసిక ఆనందంలో మునిగి తపస్సు చేసుకుంటూ వుండేవాళ్ళు ....అంత ఆనందాన్ని అనుభవించాలి అంటే ముందు మన మనసు స్పందిచగల వాతావరణం కల్పించాలి ....

మన ఆనందాన్ని హరించటం లో డబ్బుకి ఎంత పాత్ర అయితో వుందో దానికంటే కూడా ..ఈ సమాజ కట్టుబాట్లు ,కులాలు ,మతాలు ఇవన్ని కలిపి--- ఇలా వుంటేనే మనిషి అని కొన్ని రేఖ లు గీసి .... లేదంటే పిచ్చివాడిగా లెక్కకట్టే సమాజం ...ప్రతిదానికి కులం మతం అని అంటగట్టే చాన్దసవాదులు వున్నసమాజం --- ప్రతి క్షణం సమాజానికి ప్రతి విషయంలో భయపడుతూ వుంటే మనిషికి ఆనందించే ఛాన్స్ ఎక్కడిది ....పెద్ద పెద్ద మాటలు ఎందుకు అనుకోవటం ఒక చిన్న ఊదాహరణకి ....రెండు నెలల వేసవి ప్రతాపం తర్వాత ..వర్షం పడుతుంటే చాల మందికి తడవాలనిపిస్తుంది ... రోడ్ పైన మన చుట్టూ పదిమంది వుంటే వాళ్ళందరూ ఏమనుకుంటారో అని ఆ కోరికని అణుచుకొని అలాగే వాళ్ళ ప్రక్కన వర్షం లో తడవకుండా నిల్చుంటాము ..అల అందరి ముందు తడిస్తే వింతగా చూస్తారేమో అన్న భయం ..ఎప్పుడు భయమే ...ప్రతి దానికి ప్రక్కన వాళ్ళు ఏమనుకుంటారో అని భయం..భయం ..జీవిత ప్రయాణం మొదలయ్యే తల్లి గర్భం నుండి బయటపడే టప్పుడు వచ్చే చిన్న భయాన్ని జీవితాంతం వరకు అదే భయాన్ని వదలకుండా తర్వాత తరాలకి అదే భయాన్ని వదిలేసి వెళ్తున్నాం .

మానసిక ఆనందం దేవుడెరుగు--- మనం ఏ ఆనందం లో బ్రతకటం లేదు--- అసలు ఆనందం అంటే ఏంటో కూడా తెలియని స్టేజి లో జీవితాన్ని సాగిస్తున్నాం ......లేచి న దగ్గర నుండి పరుగులు పరుగులు ---దేనికోసం ఈ పరుగులు ..ఎందుకోసం ఈ పరుగులు ... ఎవరికోసం ఈ పరుగులు ....తరతరాలు తిన్నా తరగని ఆస్తి సంపాదించటం కోసమేనా ...ఎవరి ఆస్తి వాళ్ళు .....ఎవరి జీవితాన్ని వాళ్ళు తీర్చి దిద్దుకునేల మన సమాజం తాయారు అయ్యేది ఎప్పుడు ...ఎప్పుడు మన పిల్లలు ఏమి అవ్వకూడదు వాళ్ళు కూర్చొని తిన్నా తరగకూడదు--- అంత ఆస్తిని సంపాదించాలి వాళ్ళకి ఏమి కష్టం రాకూడదు ..ఇలాంటి ఆలోచనలతో తర్వత తరాల వాళ్లకి సొంత ఆలోచనలు లేకుండా చేయటమే కాకుండా వాళ్ళకి వారసత్వంగా మనం సంపాదించిన ఆస్తిని నిలబెట్టే మహత్తర కార్యక్రమాన్ని అందించి వాళ్ళ జీవితంలో కూడా ఆనందం లేకుండా చేస్తున్నామనే విష యం మర్చిపోతున్నాం . మనం చేసే

పనిలో ఆనందం వెతుక్కోవటం కొంత లో కొంత సంతోషించ దగ్గ పరిణామం ..అల ఎంత మంది ఆనందించ గలుగుతున్నారు వాళ్ళు చేసే పనిలో ...చాల మందికి వాళ్ళు చేసే పని వాళ్ళకే నచ్చదు ,,,,వాళ్ళ బాస్ కోసమో లేక వాళ్ళ మేనేజర్ కోసమో కష్టపడుతున్నాం అనుకుంటారు కాని వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడుతున్నారు అని ఎంత మంది ఫీల్ అయ్యి వాళ్ళ పనిలో ఆనందాన్ని వెతుకుంటున్నారు .......

ఇప్పుడు వున్న సమాజం లో డబ్బుకి చాలా ప్రాముఖ్యత ఉంది ...మనం చేసే పనిలో ఆనందాన్ని వెతక్కుంటూ దానివల్ల వచ్చే డబ్బు ఒక్కతరం వాళ్ళే అనుభవిస్తూ రాబోయే తరాల వాళ్ళు, వాళ్ళ యొక్క సొంత శక్తి తో ఒక్కో మెట్టు ఎక్కుతూ వాళ్ళ కష్టం తో వచ్చేఫలితం వల్ల పొందే ఆనందాన్ని అనుభవించే వాతావరణాన్ని కల్పిస్తూ ..వాళ్ళ కి స్పూర్తి దాయకంగా నిలబడగలగటమే ఇప్పుడు మనముందు వున్న లక్ష్యం..
----- పాకలపాటి అమర్ నాధ్

Comments

Popular posts from this blog

64 కళలు ( విద్యలు ) అంటే ?

64 కళలు ( విద్యలు ) అంటే ? మన భారతీయ సంస్కృతిలో 64 కళలు ను తెలియజేసే శ్లోకం వేద వేదాంగేతిహాసాగమ, న్యాయకావ్యాలంకార, నాటక, గాన కవిత్వ కామశాస్త్ర శకున, సాముద్రికారత్న పరీక్షాస్వర్ణపరీక్షా శ్వలక్షణ, గజలక్షణ, మల్లవిద్యా, పాకకర్మ దోహళ గంధవాద ధాతువాద ఖనీవాద, రసవాదాగ్నిస్తంభజలస్తంభ వాయుస్తంభ ఖడ్గస్తంష, వశ్యాకర్షణ మోహన విద్వేషణోచ్ఛాటన మారణ కాలవంచన వాణిజ్య, పాశుపాల్య కృష్యా సవకర్మలావుక యుద్ధమృగయా, రతికౌశలా దృశ్యకరణీద్యూతకరణీ చిత్రలోహ పాషాణ మృద్దారు వేణు చర్మాంబరక్రియా చౌర్యౌషధసిద్ధి స్వరవంచనా దృష్టివంచనాంజన, జలప్లవన వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య చతుష్టష్టివిద్యా నిషద్యాయమాన నిరవద్య విద్వజ్ఞాన విద్యోతితే. అర్థము: 1. వేదములు (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అధర్వణవేదము అను నాల్గు) 2. వేదాంగములు ….శిక్షలు, వ్యాకరణము , ఛందస్సు , జ్యోతిషము , నిరుక్తము , కల్పములు అని వేదాంగములు ఆరు శాస్త్రములు 3. ఇతిహాసములు …. రామాయణ,మహాభారత, భాగవతం పురాణాదులు 4. ఆగమశాస్త్రములు …. శైవాగమము ,పాంచరాత్రాగమము , వైఖానసాగమము ,స్మార్తాగమము అని ఆగమములు నాలుగు . 5. న్యాయము …..తర్కశాస్త్రమునకు పేరు 6. కావ్యాల...

ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో

ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో సంసారపు గోడలమధ్య ఎక్కడ భాగాలకింద ప్రపంచం విడిపోలేదో ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో ఎక్కడ అలసట నెరగనిశ్రమ తనబాహువుల్ని పరిపూర్ణతవైపు జాస్తుందో ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా వుంటుందో ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ కార్యాలలోకీ నీచే నడపబడుతుందో ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రీ నాదేశాన్ని మేల్కొలుపు. PAKALAPATI AMARNADH

గణతంత్ర దినోత్సవం

మిత్రులకు ముందుగా “గణతంత్ర దినోత్సవ” శుభాకాంక్షలు... నిన్న “N - న్యూస్” అనే చానల్ సర్వే చేసిన వీడియో ఒకటి చూసాను.. ఆ సర్వే ఏంటంటే అసలు “గణతంత్ర దినోత్సవం” అంటే ఏంటి ?? ఈ విషయాన్ని ఎంతమంది విద్యార్ధులు చెప్తారు ?? నిజానికి ఆ వీడియో చూసాక ఎవరైనా ఓ డబల్ బ్యారల్ గన్ తీసుకుపోయి ఆ సమాధానాలు చెప్పేవాళ్ళను కాల్చిపారేయ్యాలనిపిస్తుంది .. ఒకడేమో జనవరి 26 ప్రేమికుల రోజు అంటున్నాడు.. ఇంకొకరేమో జనవరి 26 గాంధీ జయంతి అంటున్నారు.. మరొకరేమో జనవరి 26 హాలిడే కాబట్టి ఎంజాయ్ చేసే రోజు అంట.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా చాలా దారుణంగా సమాధానాలు ఇస్తుంటే .. నిజంగా వీళ్ళు మన భారతీయులేనే ?? అనిపిస్తుంది ... ఇదేనా మనం గొప్పగా చూస్తున్న సువిశాల భారతదేశం ... అంతెందుకు ఇది చదువుతున్న మీరే మీ మనసాక్షిని అడగండి.. ఎంతమందికి “గణతంత్ర దినోత్సవం” అంటే ఏంటి ?? అన్న విషయం తెలుసు.. ఒక సినిమాకు ఇచ్చే విలువ కూడా మనం మన దేశానికి ఇవ్వలేకపోవడం శోచనీయం.. స్కూల్స్ లో “గణతంత్ర దినోత్సవం”నాడు జెండా పట్టుకొని, చాక్లెట్స్ తీసుకొని, కాసేపు గీతాలు పాడుకొని, ఏవైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ వుంటే అవి చూసి ఇంటికి రావడమే మనం తెలుసుకున్నాం.. ఆ స్కూల్స్...