Skip to main content

గణతంత్ర దినోత్సవం

మిత్రులకు ముందుగా “గణతంత్ర దినోత్సవ” శుభాకాంక్షలు...

నిన్న “N - న్యూస్” అనే చానల్ సర్వే చేసిన వీడియో ఒకటి చూసాను.. ఆ సర్వే ఏంటంటే అసలు “గణతంత్ర దినోత్సవం” అంటే ఏంటి ?? ఈ విషయాన్ని ఎంతమంది విద్యార్ధులు చెప్తారు ??

నిజానికి ఆ వీడియో చూసాక ఎవరైనా ఓ డబల్ బ్యారల్ గన్ తీసుకుపోయి ఆ సమాధానాలు చెప్పేవాళ్ళను కాల్చిపారేయ్యాలనిపిస్తుంది ..

ఒకడేమో జనవరి 26 ప్రేమికుల రోజు అంటున్నాడు..
ఇంకొకరేమో జనవరి 26 గాంధీ జయంతి అంటున్నారు..
మరొకరేమో జనవరి 26 హాలిడే కాబట్టి ఎంజాయ్ చేసే రోజు అంట..

ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా చాలా దారుణంగా సమాధానాలు ఇస్తుంటే ..
నిజంగా వీళ్ళు మన భారతీయులేనే ?? అనిపిస్తుంది ...

ఇదేనా మనం గొప్పగా చూస్తున్న సువిశాల భారతదేశం ...
అంతెందుకు ఇది చదువుతున్న మీరే మీ మనసాక్షిని అడగండి.. ఎంతమందికి “గణతంత్ర దినోత్సవం” అంటే ఏంటి ?? అన్న విషయం తెలుసు..

ఒక సినిమాకు ఇచ్చే విలువ కూడా మనం మన దేశానికి ఇవ్వలేకపోవడం శోచనీయం..

స్కూల్స్ లో “గణతంత్ర దినోత్సవం”నాడు జెండా పట్టుకొని, చాక్లెట్స్ తీసుకొని, కాసేపు గీతాలు పాడుకొని, ఏవైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ వుంటే అవి చూసి ఇంటికి రావడమే మనం తెలుసుకున్నాం.. ఆ స్కూల్స్ లో ఒక్క ఉపాధ్యాయుడు అయినా ఒక చిన్న ప్రసంగాన్ని చేసి అసలు “గణతంత్ర దినోత్సవం” అంటే ఏంటి ఎప్పుడొచ్చింది ? .. ఎందుకొచ్చింది ? .. ఈరోజుకు ఎన్ని సంవత్సరాలు అయింది అనే విషయాలను తెలియజేసి వుంటే నేడు విద్యార్ధులకు ఈ దుస్థితి పట్టేది కాదు..
దయచేసి ఇకనుంచి అయినా విద్యార్ధులకు ఒక స్పష్టతను, అవగాహనను కలిగించమని ప్రార్ధిస్తున్నాను..

ఇకపోతే మన భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950 అనేది గుర్తుపెట్టుకోదగ్గ ముఖ్యమైన రోజు ఈ “గణతంత్ర దినోత్సవం” ... . భారత దేశానికి స్వాతంత్ర్యం ఆగస్టు 15, 1947 లోనే వచ్చింది.. కానీ, ఈ జనవరి 26, 1950 న భారత రాజ్యాంగం నిర్మించబడి, డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు తొలి రాష్ట్రపతిగా భాద్యతలు స్వీకరించి మన దేశం పూర్తి గణతంత్ర దేశం అయిన రోజు ఈ రోజు..
ఈ రోజు నుండి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వం అయింది.. ఎందరో మహానుభావుల త్యాగఫలం వలన మనకు ఈ 'గణతంత్ర రాజ్యం' ఏర్పడినది. 'గణతంత్ర రాజ్యం' అంటే ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు....

"ఏ దేశమేగినా,ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము"

అని ఎలుగెత్తి కీర్తించిన రాయప్రోలు సుబ్బారావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ...

మన ముందు తరాల త్యాగ ఫలాలు భోంచేస్తున్న మనం ఇప్పుడు కొత్తగా త్యాగాలు చేయాల్సిన అవసరమేమీ లేదు. ప్రతి ఏటా ఈ గణతంత్ర దినోత్సవమును జరుపుకోడానికి కాస్త తీరిక చేసుకుంటే చాలు అని మనవి చేసుకుంటూ ..

దేశం కోసం నాటి నుంచి నేటి వరకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన అమరవీరులకు అశ్రునివాళులు అర్పిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడను ప్రార్దిస్తూ..

మిత్రులకు మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Comments

Post a Comment

Popular posts from this blog

నా మాట

నా మాట   అమ్మ చూపించే అనురాగం   నా మాట నాన్న నుండి వచ్చే  బాధ్యత  నా మాట  గురువులు  ఇచ్చే జ్ఞానభోద  నా మాట  సమాజాన్ని చెక్కిన  శిల్పుల  నైపుణ్యత  నా మాట జాతిని నడిపిన  మహనీయుల మార్గం  నా మాట  ధర్మాన్ని చూపిన  ధర్మాత్ముల ప్రతిరూపం నా మాట పేదోడి కన్నీటి చుక్కల  ప్రతిబింబం  నా మాట  అభాగ్యుల ఆర్తనాదాల   అభిముఖం  నా మాట     భయస్తుడు డిక్కీ   ధైర్య గుళికల  సమూహం  నా మాట  ఓటమిలో ఓదార్పు   మంత్రాలను  అందించే  వేదం    నా మాట  గర్వానికి మొట్టికాయలు  వేసే  పిడికిలి  నా మాట  స్నేహితుడు చిలిపి చేష్టల  ఆనందోత్సవం  నా మాట అన్నతమ్ముల  ఆత్మీయ బంధం  నా మాట స్మశాన వైరాగ్యాలు   నా మాట జీవితాంతం తోడు ఉండే మీ ఆత్మ ఘోష లు  పాకలపాటి  అమర్  నాథ్

సుఖం .....సంతోషం

సుఖం .....సంతోషం సుఖంగా వుంటే సంతోషంగా వున్నట్టేనా? సుఖంగా వున్నప్పుడు అంత సంతోషమేనా? సుఖం ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇవ్వగలదా? ఆనందంగా వున్నామంటే సుఖంగావున్నట్టా? మనిషి కోరుకునేది సుఖంనా ? జీవితం ఎప్పుడు సుఖంగా వుంటే సరిపోతుందా? సుఖంగా వుండి ఆనందంగా వున్నామనే భ్రమలో బ్రతుకుతున్నామా? మనం అనుభవించ వలసిన ఆనందాన్ని సుఖం మత్తులో పడి ఇదే ఆనందం కాబోలు అనుకొని అలాగే బ్రతికేస్తున్నామా? చెట్టు కింద బ్రతికే వాళ్ళకి ఒక ఇల్లు, దానిలో ఒక ఫ్యాన్ ,దాని కింద నిద్రపోతే అది వాళ్ళకి సుఖంగా వున్నామని అనిపించొచ్చు ,అలాగే ఫ్యాన్ వున్నా వాళ్ళకి కూలర్ ...కూలర్ వున్నవాళ్ళకి ఏసి సుఖాన్ని ఇస్తుంది ....అల ఒకదాని తర్వాత ఒకటి జీవితం లో సమకూర్చుకుంటూ---- వాటి వెనకాల పడుతూ--- వాటిని సమకూర్చుకొనుటకు --డబ్బు సంపాదనే ధ్యేయంగా ఎంతో విలువైన సమయాన్ని కేవలం మనకు సుఖాన్నిచ్చే కొన్ని వస్తువల కోసం జీవితం లో అనుభవించవలసిన ఆనందాన్ని అంతా పోగొట్టుకుంటున్నాం .... ఇక్కడ డబ్బు సంపాదించటం దానివల్ల వచ్చే సుఖాన్ని వదిలేయమనటం కాదు నా ఉద్దేశం .... మనం రోజు చేసే పనుల్లో సాధించే విజయాలని పూర్తిగా ఆస్వాదిస్తూ ..అ ఆనందాన్ని అనుభవించే టైం మ...

NTR

తెలుగుజాతి ఆత్మగౌరవం, ఆరడుగుల అజనుబహుడు, శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, మహాశివుడు, దుర్యోధనుడు,రావణుడు, స్వామి వివేకానంద, శ్రీనాధా కవి సార్వభౌముడు,జమీందారు, కూలివాడిగా, రైతుగా, బడిపంతులుగా, ఇలా ఏ పాత్ర పోషించిన పాత్రకె వన్నె  తెచ్చే నటన మీ అభినయానికి చిహ్నం  ✍🏻పాకలపాటి అమర్ నాధ్✍🏻