Skip to main content

ఎవరి నుండి ఏం కావాలి?

ఎవరి నుండి ఏం కావాలి?

ప్రపంచానికి దూరమవుతామేమోనని నిరంతరం మాట ద్వారా, చేత ద్వారా అస్థిత్వపు పోరాటంలో పెనుగులాడడం.. మనల్ని మనకు కాకుండా చేస్తోంది…

విషయమేమిటో అర్థం కావాలంటే…

మనిషి సంఘజీవి.. సంఘంతో కలిసి మెలసి ఉంటే సంఘం హర్షిస్తుంది… మనిషికి మానసిక భరోసానూ లభిస్తుంది…

ఒక సగటు మనిషిగా మనం సంఘం నుండి ఆశించవలసిన దానికన్నా ఎక్కువ ఆశించడం మొదలెట్టినప్పుడే వ్యర్థప్రయాసలు మొదలవుతాయి…

సొసైటీ, మనుషులూ మన జీవితంలో play చెయ్యాల్సిన role చాలా కొద్ది భాగమే… కానీ మనం చాలా expect చేస్తున్నాం….

మనకు అప్రిషియేషన్ సొసైటీ నుండే రావాలీ.. మన ఇగోలు సొసైటీ చేతే శాటిస్‌ఫై చేయబడాలి… మనం కోరుకునే “రాముడు మంచి బాలుడు” ఇమేజ్‌ సొసైటీ నుండే కావాలి….

అప్రిషియేషన్, ఇగో సంతృప్తి, క్లీన్ ఇమేజ్ వంటివి సొసైటీ ద్వారా ఒకప్పుడూ మనుషులకు లభించేవి.. ఇప్పుడూ లభిస్తున్నాయి… అయితే తేడా అల్లా.. ఇప్పుడు మనం చేసే ప్రతీ పనీ ఆ results వస్తాయా లేదా అన్న expectationతో చేస్తున్నాం… అంతకుముందు మనం గుడ్డిగా పని చేసుకుంటూ పోతే అవి ఆటోమేటిక్‌గా వచ్చేవి.

———————-

సో మనిషి నిరంతరం సొసైటీ తనకి కొమ్ము కాయాలనుకుంటున్నాడు… తాను చేసే ప్రతీ పనీ గుర్తింపూ, అప్రిషియేషన్, మంచో, చెడ్డో, న్యూట్రలో ఏదో ఒక ఇమేజ్ అందరూ గుర్తుంచుకునేది కావాలని తాపత్రయపడుతున్నాడు.. అందుకే ఈ మధ్య “I am very bad boy.. I am very bad girl… I am typical to understand” అంటూ తమకి తాము ప్రత్యేకతను ఆపాదించుకుంటూ మనుషులు taglineలు తగిలించుకుంటున్నారు.

ప్రపంచం కోసం పనిచేయడం వేరు… ప్రపంచం నుండి ఆశిస్తూ పనిచేయడం వేరు…

ఎప్పుడైతే ఈ రెండింటి మధ్యా సన్నటి గీతా చెరిగిపోయిందో..

గొప్ప గొప్ప వాళ్లు కూడా ప్రపంచం కోసం పనిచేయడం మానేసి… ప్రపంచం నుండి ఆశిస్తూ పనిచేయడం మొదలెడుతున్నారు.. వారికున్న సహజసిద్ధంగా వచ్చే fragranceని కూడా చేజేతులా పోగొట్టుకుంటున్నారు.

మనల్ని మనం మార్కెట్ చేసుకోవడం.. ప్రపంచం దృష్టిలో ఓ గొప్ప ఇమేజ్‌లో నిలబెట్టుకోవాలనుకోవడం… క్రేజీగా ఉండొచ్చు.. కొంత థ్రిల్‌నీ, అప్రిషియేషన్‌నీ సాధించి పెట్టొచ్చు…

కానీ…….

మనం ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం…

ఎదుటి వారు మన ఇగో సంతృప్తి పరిస్తేనే మనకు సంతోషం వస్తుందనుకుంటే.. ఇగోలతోనూ, మనుషులతోనూ పనిలేని మన స్వంత సంతోషం మనం మర్చిపోయినట్లే కదా?

ఎదుటి వారు అప్రిషియేట్ చేస్తేనే మన రొమ్ములు పొంగిపోతున్నాయంటే… మనం తినే ఆహారం ద్వారా సమకూరే శక్తీ.. ఆ శక్తి ద్వారా జ్వలించాల్సిన fire మనలో చల్లారిపోతున్నట్లే కదా?

———————————-

నిరంతరం ఎక్కడోచోట మొహం దేబిరించుకుని పొగడ్తల కోసమో, స్ఫూర్తి కోసమో, ఇగో సంతృప్తి పడడం కోసమో వేచి చూస్తున్నామంటే మనం ఫిజికల్లీ అండ్ మెంటల్లీ unfit అనే కదా అర్థం?

ధన్యవాదాలు

Comments

Popular posts from this blog

ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో

ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో సంసారపు గోడలమధ్య ఎక్కడ భాగాలకింద ప్రపంచం విడిపోలేదో ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో ఎక్కడ అలసట నెరగనిశ్రమ తనబాహువుల్ని పరిపూర్ణతవైపు జాస్తుందో ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా వుంటుందో ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ కార్యాలలోకీ నీచే నడపబడుతుందో ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రీ నాదేశాన్ని మేల్కొలుపు. PAKALAPATI AMARNADH

నా మాట

నా మాట   అమ్మ చూపించే అనురాగం   నా మాట నాన్న నుండి వచ్చే  బాధ్యత  నా మాట  గురువులు  ఇచ్చే జ్ఞానభోద  నా మాట  సమాజాన్ని చెక్కిన  శిల్పుల  నైపుణ్యత  నా మాట జాతిని నడిపిన  మహనీయుల మార్గం  నా మాట  ధర్మాన్ని చూపిన  ధర్మాత్ముల ప్రతిరూపం నా మాట పేదోడి కన్నీటి చుక్కల  ప్రతిబింబం  నా మాట  అభాగ్యుల ఆర్తనాదాల   అభిముఖం  నా మాట     భయస్తుడు డిక్కీ   ధైర్య గుళికల  సమూహం  నా మాట  ఓటమిలో ఓదార్పు   మంత్రాలను  అందించే  వేదం    నా మాట  గర్వానికి మొట్టికాయలు  వేసే  పిడికిలి  నా మాట  స్నేహితుడు చిలిపి చేష్టల  ఆనందోత్సవం  నా మాట అన్నతమ్ముల  ఆత్మీయ బంధం  నా మాట స్మశాన వైరాగ్యాలు   నా మాట జీవితాంతం తోడు ఉండే మీ ఆత్మ ఘోష లు  పాకలపాటి  అమర్  నాథ్

ఆచార్య శ్రీ బేతావోలు రామబ్రహ్మం గారికి రాష్టప్రతి పురస్కారం

ఆచార్య శ్రీ బేతావోలు రామబ్రహ్మం గారికి రాష్టప్రతి పురస్కారం వచ్చిన సందర్భంగా హార్ధిక శుభాకాంక్షలు. బేతవోలు రామబ్రహ్మం గారు ప్రముఖ తెలుగు పండితులు, అవధాని, రచయిత మరియు విమర్శకులు. బాల్యం / విద్యాభ్యాసం:- బేతావోలు రామబ్రహ్మం గారి ఒక అతి సామాన్య కుటుంబంలో తల్లిదండ్రులు శ్రీ బేతావోలు సత్యనారాయణ మూర్తి రాధ రుక్మిణీ వీరి తండ్రి గారు వృత్తి రీత్యా పశ్చిమ గోదావరి జిల్లా, నల్లజర్ల గ్రామంలో ఆర్&బి గుమస్తాగా పని చేయడం వల్ల వీరు నల్లజర్ల గ్రామంలో 1948, జూన్ 10 న జన్మించారు. కష్టాలే తోడుగా ఈయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. ఆ తర్వాత కొవ్వూరు సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ తెలుగు చదివారు. తరువాత నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య తూమాటి దొణప్ప పర్యవేక్షణలో తెలుగు వ్యాకరణాలపై సంస్కృత వ్యాకరణాల ప్రభావం అనే అంశంపై పి.హెచ్.డి చేశారు. ఉద్యోగం:- మొట్టమొదట ఇతడు గుంటూరులోని కెవికె సంస్కృత కళాశాలలో ఉపన్యాసకులుగా చేరారు. ఈయన బోధన విద్యార్థులకే కాక సహ అధ్యాపకులైన మల్లంపల్లి వీరేశ్వరశర్మ , కోగంటి సీతారామచార్యులు, జమ్మలమడక మాధవరామశర్మ వంటి పండితులను కూడా ఆకర్షించేది...