ఆచార్య శ్రీ బేతావోలు రామబ్రహ్మం గారికి రాష్టప్రతి పురస్కారం వచ్చిన సందర్భంగా హార్ధిక శుభాకాంక్షలు. బేతవోలు రామబ్రహ్మం గారు ప్రముఖ తెలుగు పండితులు, అవధాని, రచయిత మరియు విమర్శకులు. బాల్యం / విద్యాభ్యాసం:- బేతావోలు రామబ్రహ్మం గారి ఒక అతి సామాన్య కుటుంబంలో తల్లిదండ్రులు శ్రీ బేతావోలు సత్యనారాయణ మూర్తి రాధ రుక్మిణీ వీరి తండ్రి గారు వృత్తి రీత్యా పశ్చిమ గోదావరి జిల్లా, నల్లజర్ల గ్రామంలో ఆర్&బి గుమస్తాగా పని చేయడం వల్ల వీరు నల్లజర్ల గ్రామంలో 1948, జూన్ 10 న జన్మించారు. కష్టాలే తోడుగా ఈయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. ఆ తర్వాత కొవ్వూరు సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ తెలుగు చదివారు. తరువాత నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య తూమాటి దొణప్ప పర్యవేక్షణలో తెలుగు వ్యాకరణాలపై సంస్కృత వ్యాకరణాల ప్రభావం అనే అంశంపై పి.హెచ్.డి చేశారు. ఉద్యోగం:- మొట్టమొదట ఇతడు గుంటూరులోని కెవికె సంస్కృత కళాశాలలో ఉపన్యాసకులుగా చేరారు. ఈయన బోధన విద్యార్థులకే కాక సహ అధ్యాపకులైన మల్లంపల్లి వీరేశ్వరశర్మ , కోగంటి సీతారామచార్యులు, జమ్మలమడక మాధవరామశర్మ వంటి పండితులను కూడా ఆకర్షించేది...
Comments
Post a Comment