Skip to main content

గణతంత్రం అంటే ఏమిటి ?

[8:40 PM, 2/2/2019] అమర్నాథ్ పాకలపాటీ: భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా
జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా
జరుపుతారు. 26 జనవరి 1950లో భారత ప్రభుత్వ చట్టానికి (1935) బదులు భారత
రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు.
భారత రాజ్యాంగ సభలో నవంబర్ 26, 1949న రాజ్యాంగం ఆమోదం పొందగా
భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు జనవరి 26, 1950లో దీనిని
ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని
నిర్ణయించారు.
26 జనవరినే ఇందుకు ఎంచుకోవడానికి చారిత్రికమైన కారణం ఉంది. 1930లో భారత
జాతీయ కాంగ్రెస్‌ పూర్ణ స్వరాజ్‌ని ఆ రోజే ప్రకటించుకుంది. అందుకు సంపూర్ణ
స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు ఈ రోజున చేయాలని నిర్ణయించారు........
చరిత్ర :-
జనవరి 26, 1950న భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చింది.
భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందిన రాజనీతివేత్తలు, రాజకీయ
నేతలు, వివిధ రంగాల నుంచి నామినేట్ చేసిన నిపుణులు కలిసి భారత రాజ్యాంగాన్ని
చర్చలు, నిర్ణయాల ద్వారా రాశారు. 1946 నుంచి 1949 వరకూ ఈ బృందం భారత
పార్లమెంటు హాలులో సమావేశమై చర్చలు చేశారు. జనవరి 26ను స్వాతంత్ర్య
దినోత్సవంగా జరుపుకొన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు. ఆ రోజును
స్వాతంత్ర్య దినోొత్సవంగా వ్యవహరించారు. ఐతే దేశ స్వాతంత్ర్య దినం బ్రిటీషర్లు
స్వయంగా నిర్ణయించడంతో నెహ్రూ తదితర జాతీయోద్యమనేతలు జనవరి 26ను దేశ
గణతంత్ర దినోత్సవంగా చేశారు.

Comments

Popular posts from this blog

64 కళలు ( విద్యలు ) అంటే ?

64 కళలు ( విద్యలు ) అంటే ? మన భారతీయ సంస్కృతిలో 64 కళలు ను తెలియజేసే శ్లోకం వేద వేదాంగేతిహాసాగమ, న్యాయకావ్యాలంకార, నాటక, గాన కవిత్వ కామశాస్త్ర శకున, సాముద్రికారత్న పరీక్షాస్వర్ణపరీక్షా శ్వలక్షణ, గజలక్షణ, మల్లవిద్యా, పాకకర్మ దోహళ గంధవాద ధాతువాద ఖనీవాద, రసవాదాగ్నిస్తంభజలస్తంభ వాయుస్తంభ ఖడ్గస్తంష, వశ్యాకర్షణ మోహన విద్వేషణోచ్ఛాటన మారణ కాలవంచన వాణిజ్య, పాశుపాల్య కృష్యా సవకర్మలావుక యుద్ధమృగయా, రతికౌశలా దృశ్యకరణీద్యూతకరణీ చిత్రలోహ పాషాణ మృద్దారు వేణు చర్మాంబరక్రియా చౌర్యౌషధసిద్ధి స్వరవంచనా దృష్టివంచనాంజన, జలప్లవన వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య చతుష్టష్టివిద్యా నిషద్యాయమాన నిరవద్య విద్వజ్ఞాన విద్యోతితే. అర్థము: 1. వేదములు (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అధర్వణవేదము అను నాల్గు) 2. వేదాంగములు ….శిక్షలు, వ్యాకరణము , ఛందస్సు , జ్యోతిషము , నిరుక్తము , కల్పములు అని వేదాంగములు ఆరు శాస్త్రములు 3. ఇతిహాసములు …. రామాయణ,మహాభారత, భాగవతం పురాణాదులు 4. ఆగమశాస్త్రములు …. శైవాగమము ,పాంచరాత్రాగమము , వైఖానసాగమము ,స్మార్తాగమము అని ఆగమములు నాలుగు . 5. న్యాయము …..తర్కశాస్త్రమునకు పేరు 6. కావ్యాల...

ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో

ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో సంసారపు గోడలమధ్య ఎక్కడ భాగాలకింద ప్రపంచం విడిపోలేదో ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో ఎక్కడ అలసట నెరగనిశ్రమ తనబాహువుల్ని పరిపూర్ణతవైపు జాస్తుందో ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా వుంటుందో ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ కార్యాలలోకీ నీచే నడపబడుతుందో ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రీ నాదేశాన్ని మేల్కొలుపు. PAKALAPATI AMARNADH

నా మాట

నా మాట   అమ్మ చూపించే అనురాగం   నా మాట నాన్న నుండి వచ్చే  బాధ్యత  నా మాట  గురువులు  ఇచ్చే జ్ఞానభోద  నా మాట  సమాజాన్ని చెక్కిన  శిల్పుల  నైపుణ్యత  నా మాట జాతిని నడిపిన  మహనీయుల మార్గం  నా మాట  ధర్మాన్ని చూపిన  ధర్మాత్ముల ప్రతిరూపం నా మాట పేదోడి కన్నీటి చుక్కల  ప్రతిబింబం  నా మాట  అభాగ్యుల ఆర్తనాదాల   అభిముఖం  నా మాట     భయస్తుడు డిక్కీ   ధైర్య గుళికల  సమూహం  నా మాట  ఓటమిలో ఓదార్పు   మంత్రాలను  అందించే  వేదం    నా మాట  గర్వానికి మొట్టికాయలు  వేసే  పిడికిలి  నా మాట  స్నేహితుడు చిలిపి చేష్టల  ఆనందోత్సవం  నా మాట అన్నతమ్ముల  ఆత్మీయ బంధం  నా మాట స్మశాన వైరాగ్యాలు   నా మాట జీవితాంతం తోడు ఉండే మీ ఆత్మ ఘోష లు  పాకలపాటి  అమర్  నాథ్