ఎక్కడితే స్త్రీలు గౌరవించబడతారో ఆ దేశం సస్యస్యామలంగ వుంటుంది. అందుకే ఒక కవి స్త్రీ గురించి ఇలా రాసాడు బ్రతుకు ముల్లబాటలోన్ జతగా స్నేహితురాలవయ్తివి....కన్నీళ్ళు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లెవైతివి....వెనక ముందు రాలినప్పుడు వెన్నుతట్టిన భార్యవైతివి....పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి.....అని అన్నారు. కష్టంలో ముందుండి.... సుఖంలో క్రిందుండి....విజయంలో వెనకుండి ....ఎల్లప్పుడు పక్కనుండేదే స్త్రీ. స్త్రీని పూర్వ కాలంలో అబల అనగా బలం లేనిది అనేవారు. పూర్వం స్త్రీలు ఇంటి పట్టున ఉండి ఇంటి పనులు చేసుకొనేవారు. వివాహితలు ఇంటిని చక్కదిద్దుకుంటూ భర్త, పిల్లల యొక్క బాగోగులు చూసుకొనేవారు. ఆ విధంగా గృహిణి పాత్ర నూరు శాతం వహించేది. యుద్ధానికి వెళ్ళే పురుషులను ఆశీర్వదించేవారు. కాని నేడు స్త్రీలు బయటకు వచ్చి పురుషులతో పోటీగా చదువుతూ, ఉద్యోగాలు చేస్తూ, పురుషుల పరిమితమైన విజయాల్ని సైతం దక్కించుకుంటున్నారు, పూర్తి ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. ఆధునిక కాలంలో ఆడది అబల కాదు 'సబల' అనగా పురుషులతో సమాన స్థాయికి చేరుకోగలదు అని నిరూపించుకుంటున్నారు. నేటి స్త్రీ ఉద్యోగాల వల్ల ఎంతో ఒత్తిడి ఎదుర్కొకుంటోంది. అయితే స్త్రీ సాధికారత వల్ల గృహిణి పాత్ర మాత్రం కాస్త తక్కువైందని, పిల్లలకు తల్లి శిక్షణ కొరవడిందని, స్త్రీ ఆర్థిక స్వేచ్ఛ దుర్వినియోగం వల్ల కుటుంబ వ్యవస్థ కాస్త బలహీన పడింది అని చెప్పవచ్చు.
[8:40 PM, 2/2/2019] అమర్నాథ్ పాకలపాటీ: భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు. 26 జనవరి 1950లో భారత ప్రభుత్వ చట్టానికి (1935) బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు. భారత రాజ్యాంగ సభలో నవంబర్ 26, 1949న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు జనవరి 26, 1950లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు. 26 జనవరినే ఇందుకు ఎంచుకోవడానికి చారిత్రికమైన కారణం ఉంది. 1930లో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్‌ని ఆ రోజే ప్రకటించుకుంది. అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు ఈ రోజున చేయాలని నిర్ణయించారు........ చరిత్ర :- జనవరి 26, 1950న భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందిన రాజనీతివేత్తలు, రాజకీయ నేతలు, వివిధ రంగాల నుంచి నామినేట్ చేసిన నిపుణులు కలిసి భారత రాజ్యాంగాన్ని చర్చలు, నిర్ణయాల ద్వారా ...
Comments
Post a Comment