Skip to main content

అందరూ బీటెక్కులూ, మెడిసిన్లే సదవాలి

అందరూ బీటెక్కులూ, మెడిసిన్లే సదవాలి..
అందరూ సాప్టు"వేర్లు" అయిపోవాలి..
అందరూ DSC లే రాయాలి..
అందరూ bank exams కే prepare అవ్వాలి..

.
.
.
.
సివరాకరికి
అందరూ ఉద్యోగాలే సెయ్యాలి..

130 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో 30 కోట్లకు పైగా ఉన్న యువతలో అందరికీ ఉద్యోగాలే రావాలంటే ఎలా వస్తాయి బాస్?

30 కోట్ల మంది విషయం పక్కన పెడదాం..
దాంట్లో 3%...

అంటే కోటి మందికి ఉద్యోగాలు వస్తాయా?
అది సాధ్యమా?
కోటి ఉద్యోగాలను ఇస్తాం అని అప్పుడెప్పుడో2014లో ఇచ్చిన హామీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ తీర్చలేకపోయారు.. అది అనుకున్నంత సులభం కాదు..

దేశస్థాయిలో వద్దు..

మన తెలుగు రాష్ట్రాల వరకూ మాట్లాడుకుందాం..

ప్రభుత్వోద్యోగాల విషయానికి వస్తే,
DSC (టీచర్)ఉద్యోగాలు కనీసం 3 ఏళ్లకు ఒకసారి అయినా వస్తున్నాయా?
ఇక Group 1,2 ఉద్యోగాల కోసం ఎదురుచూడడం కంటే బుద్ధితక్కువ పని మరొకటి ఉండదు...
2012 group 1 results పైన ఇప్పటికీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి..
Bank exams పేరుతో నంద్యాల గురురాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో అక్షరాలా 35,000 మందికి పైగా నిరుద్యోగులు prepare అవుతూనే ఉన్నారు..
అవనిగడ్డలో ఇంకెందరో..

ఇక ప్రై"వేటు" ఉద్యోగాలు..
ఉద్యోగం అంటేనే software అనే రేంజ్ లో ఎదిగిపోయిన ఈ sector కోసం అందరూ engineering లో CSE, IT branch లలో చేరిపోయి, చదువు అయిపోగానే అమీర్ పేటకు బ్యాగులు సర్దేసుకుని, ఏ naresh technologies లోనో, kalyan IT లోనో చేరి, జావాలు, .net లూ, ఒరాకిళ్ళు, మిరాకిళ్ళు, AWS లూ, DBA లూ, cloud లూ, sky లూ, పిండాకూడులూ, శ్రార్ధాలు అన్నీ నేర్చేసుకుని ఉద్యోగాలు రాక, back door లో నుండో, side door నుండో కూడా ప్రయత్నించి.. అక్కడ కూడా కుదరక ఏ బ్యాగునైతే సర్దుకుని అమీర్ పేటదాకా వచ్చారో, అదే అమీర్ పేటలో బస్సెక్కి జీవితంపైన నిరాశతో ఊరికి వెళ్లిపోయిన నిరుద్యోగులు "లక్షల్లోనే"..

ఓ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలవుతుంది అని తెలిస్తే, వాటి కోసం గ్రౌండ్లో 5km running practice చేసే P.G. students ఎందరో..
ఒక M.Tech చేసిన కుర్రాడు కానిస్టేబుల్ అయ్యాడు.. నేను సాక్ష్యం.
.
.
.
రెండేళ్ల క్రితం జరిగిన VRO recruitment కు Ph.D చేసిన విద్యార్థులనుండి దరఖాస్తులు వచ్చాయి అంటే, ఇక ఏమి చెప్పాలి?

ఇంతటి దుస్థితికి కారణం ఎవరో తెలుసా?
.

.
.
.

.
.
మనమే!

2 1/2 ఏళ్లకే పిల్లలను ఎత్తి ఏదో ఒక దిక్కుమాలిన play school లో వేసేస్తాం..

కొన్ని స్కూళ్లలో 4 వ తరగతికే IIT coaching అంట..
పెట్టిన వాడికి సిగ్గులేకపోతే మనకు బుద్ధిలేదా?
ఆ వయసు పిల్లలకు కనీసం writing రాయడం కూడా సరిగ్గా రాదు.. అప్పుడే IIT చదివెయ్యాలా..

ఇక్కడ కక్కుర్తి కమండలాలు ఎవరంటే ఇక్కడ తల్లిదండ్రులే
(ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటే, దయచేసి ఎక్కడైనా దూకి సచ్చిపోండి)

IIT లు, e concept లు, e learning లు, e techno ల పేరుతో వాళ్ళు ఫ్లెక్సీలు, బోర్డులు, పాంప్లెట్లు చూపించగానే ఎత్తి ఆ స్కూళ్లలో దిగబెట్టే మనది తప్పు..

ఇంటర్మీడియట్ రాగానే ఊపిరి పీల్చుకోలేని ఒత్తిడిని చూపించే మనది తప్పు..
10 లక్షల మందికి పైగా EAMCET exam రాస్తే కనీసం 5000 మంది కూడా top colleges లో చేరలేని దౌర్భాగ్యం..

ఏదో చెప్పేసి మిమ్మల్ని డైలమాలో పడేద్దామని కాదు..
.
.
.
.ఒక చిన్న లాజిక్ మాట్లాడుకుందాం..
ఎంతో అభివృద్ధి చెందిన దేశాలుగా పిలవబడే US, UK, Australia లలో మీరు ఎప్పుడైనా ఇలాంటి EAMCET , IIT coaching centres ను గానీ, Concept schools ను గానీ, చూశారా.. కనీసం విన్నారా?

అక్కడ ఉండవు..

ఎందుకో తెలుసా?

అక్కడ పిల్లలను మనలాగా చదువు, చదువు, చదువు, మార్కులు, మార్కులు, ర్యాంకులు, ఉద్యోగాలు, డబ్బులు అంటూ వేధించరు...

పిల్లలు ఏ రంగంలో అయితే రాణిస్తారో, ఏదైతే చేయగలరో, జీవితానికి సంబంధించిన వాటివైపే ప్రోత్సహిస్తారు..
అదే ఆ దేశాల విజయ రహస్యం!

ఒకప్పుడు మన చదువులు కూడా అలానే ఉండేవి..
ఏ చెట్టు క్రిందనో, ఏ గురుకులంలోనో ఒక మనిషి జీవితంలో విజ్ఞానాన్ని, వినయాన్ని, విధేయతను, ప్రాపంచిక జ్ఞానాన్ని, కష్టాలు వస్తే పోరాడే పటిమను.. ఇలా ఎన్నెన్నో విషయాలను బోధించేవారు..

ఎప్పుడైతే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించారో, విద్యను వారి వ్యాపారాలకు అనుగుణంగా మలచి చదువులను ఉద్యోగాలకు పరిమితం చేశారు..

మన చదువులను వాళ్ళు ఎత్తుకుపోయారు..
వాళ్ళ చదువులను మనకు అంతగట్టారు..

అందుకే వాళ్ళు అలా.. మనం ఇలా...

ఒక్కటి మాత్రం వాస్తవం!

పిల్లలను engineering చెయ్యి, medicine చదువు, నువ్వు పోలీస్ కావాలి, CA చెయ్యాలి.. అది నాకు ఇష్టం, మీ తాత కల, దాంట్లో డబ్బులు బాగా వస్తాయి అంటూ మన వ్యక్తిగత ఇష్టాలను వాళ్లపై రుద్దితే, ఫలితం ఇలానే... రోడ్లపైకి వచ్చి, చుట్టూ ఉన్న దిక్కుమాలిన సంతతో...మీ అబ్బాయి ఏమి చేస్తున్నాడు, ఇంకా ఉద్యోగం రాలేదా? ఇంకా settle అవ్వలేదా లాంటి ప్రత్యక్ష నరకాన్ని ప్రతీ క్షణం అనుభవించేలా చేస్తుంది!

విద్య ఉద్యోగానికి కాదు...
విద్య అంటే విజ్ఞానం..
విద్య అంటే ప్రపంచం..
విద్య అంటే జీవితం..! ----- పాకలపాటి అమర్ నాధ్

Comments

Popular posts from this blog

ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో

ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో సంసారపు గోడలమధ్య ఎక్కడ భాగాలకింద ప్రపంచం విడిపోలేదో ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో ఎక్కడ అలసట నెరగనిశ్రమ తనబాహువుల్ని పరిపూర్ణతవైపు జాస్తుందో ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా వుంటుందో ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ కార్యాలలోకీ నీచే నడపబడుతుందో ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రీ నాదేశాన్ని మేల్కొలుపు. PAKALAPATI AMARNADH

నా మాట

నా మాట   అమ్మ చూపించే అనురాగం   నా మాట నాన్న నుండి వచ్చే  బాధ్యత  నా మాట  గురువులు  ఇచ్చే జ్ఞానభోద  నా మాట  సమాజాన్ని చెక్కిన  శిల్పుల  నైపుణ్యత  నా మాట జాతిని నడిపిన  మహనీయుల మార్గం  నా మాట  ధర్మాన్ని చూపిన  ధర్మాత్ముల ప్రతిరూపం నా మాట పేదోడి కన్నీటి చుక్కల  ప్రతిబింబం  నా మాట  అభాగ్యుల ఆర్తనాదాల   అభిముఖం  నా మాట     భయస్తుడు డిక్కీ   ధైర్య గుళికల  సమూహం  నా మాట  ఓటమిలో ఓదార్పు   మంత్రాలను  అందించే  వేదం    నా మాట  గర్వానికి మొట్టికాయలు  వేసే  పిడికిలి  నా మాట  స్నేహితుడు చిలిపి చేష్టల  ఆనందోత్సవం  నా మాట అన్నతమ్ముల  ఆత్మీయ బంధం  నా మాట స్మశాన వైరాగ్యాలు   నా మాట జీవితాంతం తోడు ఉండే మీ ఆత్మ ఘోష లు  పాకలపాటి  అమర్  నాథ్

ఆచార్య శ్రీ బేతావోలు రామబ్రహ్మం గారికి రాష్టప్రతి పురస్కారం

ఆచార్య శ్రీ బేతావోలు రామబ్రహ్మం గారికి రాష్టప్రతి పురస్కారం వచ్చిన సందర్భంగా హార్ధిక శుభాకాంక్షలు. బేతవోలు రామబ్రహ్మం గారు ప్రముఖ తెలుగు పండితులు, అవధాని, రచయిత మరియు విమర్శకులు. బాల్యం / విద్యాభ్యాసం:- బేతావోలు రామబ్రహ్మం గారి ఒక అతి సామాన్య కుటుంబంలో తల్లిదండ్రులు శ్రీ బేతావోలు సత్యనారాయణ మూర్తి రాధ రుక్మిణీ వీరి తండ్రి గారు వృత్తి రీత్యా పశ్చిమ గోదావరి జిల్లా, నల్లజర్ల గ్రామంలో ఆర్&బి గుమస్తాగా పని చేయడం వల్ల వీరు నల్లజర్ల గ్రామంలో 1948, జూన్ 10 న జన్మించారు. కష్టాలే తోడుగా ఈయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. ఆ తర్వాత కొవ్వూరు సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ తెలుగు చదివారు. తరువాత నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య తూమాటి దొణప్ప పర్యవేక్షణలో తెలుగు వ్యాకరణాలపై సంస్కృత వ్యాకరణాల ప్రభావం అనే అంశంపై పి.హెచ్.డి చేశారు. ఉద్యోగం:- మొట్టమొదట ఇతడు గుంటూరులోని కెవికె సంస్కృత కళాశాలలో ఉపన్యాసకులుగా చేరారు. ఈయన బోధన విద్యార్థులకే కాక సహ అధ్యాపకులైన మల్లంపల్లి వీరేశ్వరశర్మ , కోగంటి సీతారామచార్యులు, జమ్మలమడక మాధవరామశర్మ వంటి పండితులను కూడా ఆకర్షించేది...