JAN25 : జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐💐💐💐💐💐💐💐 భారత దేశంలో ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికలే ప్రధాన గీటురాయి. ఓటు అనే రెండక్షరాలే ప్రజల జీవన స్థితిగతులను నిర్ణయిస్తాయి. విలువలు, నిజాయితీ తో కూడిన రాజకీయ వ్యవస్థను నిర్మించాలన్నా.. అవినీతి, దోపిడీ రాజ్యా లను పారదోలాలన్నా ఓటే వజ్రాయుధం. రాజకీయ విలువలను ఇనుమడింపజేసేలా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలి. ప్రజాక్షేత్రంలో ఉంటూ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి, సామాజిక అభివృద్ధికి కృషి చేసే నాయకుల్ని ప్రజాత్రినిధులుగా ఎన్నుకోవాలి. రాజకీయాల్లో పేరుకు పోయిన మంచి, చెడును వేరు చేసేలా ఓటర్లు ఓ హంస మాదిరిగా విచక్షణతో వ్యవహరించాల్సిన కీలక సమయమిది. స్వప్రయోజనాలు మాత్రమే కాకుండా విశాల భారతావని ప్రజల ఆకాంక్షలను, దేశ పురోగమనాన్ని దృష్టిలో పెట్టుకొని పవిత్రమైన ఓటు అస్త్రాన్ని సంధించాల్సిన సందర్భమిది
స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశకాలు దాటుతున్నా ఇంకా మన రాజకీయ నాయకులు అనాదిగా పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత నినాదాలనే వల్లెవేస్తున్నారు. టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ సామాన్యుడి బతుకు చిత్రం ఏమాత్రం మారడం లేదు. ✍🏻 పాకలపాటి అమర్ నాధ్✍🏻

Comments
Post a Comment