Skip to main content

Posts

Showing posts from February, 2019

నా మాట

నా మాట   అమ్మ చూపించే అనురాగం   నా మాట నాన్న నుండి వచ్చే  బాధ్యత  నా మాట  గురువులు  ఇచ్చే జ్ఞానభోద  నా మాట  సమాజాన్ని చెక్కిన  శిల్పుల  నైపుణ్యత  నా మాట జాతిని నడిపిన  మహనీయుల మార్గం  నా మాట  ధర్మాన్ని చూపిన  ధర్మాత్ముల ప్రతిరూపం నా మాట పేదోడి కన్నీటి చుక్కల  ప్రతిబింబం  నా మాట  అభాగ్యుల ఆర్తనాదాల   అభిముఖం  నా మాట     భయస్తుడు డిక్కీ   ధైర్య గుళికల  సమూహం  నా మాట  ఓటమిలో ఓదార్పు   మంత్రాలను  అందించే  వేదం    నా మాట  గర్వానికి మొట్టికాయలు  వేసే  పిడికిలి  నా మాట  స్నేహితుడు చిలిపి చేష్టల  ఆనందోత్సవం  నా మాట అన్నతమ్ముల  ఆత్మీయ బంధం  నా మాట స్మశాన వైరాగ్యాలు   నా మాట జీవితాంతం తోడు ఉండే మీ ఆత్మ ఘోష లు  పాకలపాటి  అమర్  నాథ్

NTR

తెలుగుజాతి ఆత్మగౌరవం, ఆరడుగుల అజనుబహుడు, శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, మహాశివుడు, దుర్యోధనుడు,రావణుడు, స్వామి వివేకానంద, శ్రీనాధా కవి సార్వభౌముడు,జమీందారు, కూలివాడిగా, రైతుగా, బడిపంతులుగా, ఇలా ఏ పాత్ర పోషించిన పాత్రకె వన్నె  తెచ్చే నటన మీ అభినయానికి చిహ్నం  ✍🏻పాకలపాటి అమర్ నాధ్✍🏻

గణతంత్రం అంటే ఏమిటి ?

[8:40 PM, 2/2/2019] అమర్నాథ్ పాకలపాటీ: భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు. 26 జనవరి 1950లో భారత ప్రభుత్వ చట్టానికి (1935) బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు. భారత రాజ్యాంగ సభలో నవంబర్ 26, 1949న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు జనవరి 26, 1950లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు. 26 జనవరినే ఇందుకు ఎంచుకోవడానికి చారిత్రికమైన కారణం ఉంది. 1930లో భారత జాతీయ కాంగ్రెస్‌ పూర్ణ స్వరాజ్‌ని ఆ రోజే ప్రకటించుకుంది. అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు ఈ రోజున చేయాలని నిర్ణయించారు........ చరిత్ర :- జనవరి 26, 1950న భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందిన రాజనీతివేత్తలు, రాజకీయ నేతలు, వివిధ రంగాల నుంచి నామినేట్ చేసిన నిపుణులు కలిసి భారత రాజ్యాంగాన్ని చర్చలు, నిర్ణయాల ద్వారా ...

గణతంత్ర దినోత్సవం

మిత్రులకు ముందుగా “గణతంత్ర దినోత్సవ” శుభాకాంక్షలు... నిన్న “N - న్యూస్” అనే చానల్ సర్వే చేసిన వీడియో ఒకటి చూసాను.. ఆ సర్వే ఏంటంటే అసలు “గణతంత్ర దినోత్సవం” అంటే ఏంటి ?? ఈ విషయాన్ని ఎంతమంది విద్యార్ధులు చెప్తారు ?? నిజానికి ఆ వీడియో చూసాక ఎవరైనా ఓ డబల్ బ్యారల్ గన్ తీసుకుపోయి ఆ సమాధానాలు చెప్పేవాళ్ళను కాల్చిపారేయ్యాలనిపిస్తుంది .. ఒకడేమో జనవరి 26 ప్రేమికుల రోజు అంటున్నాడు.. ఇంకొకరేమో జనవరి 26 గాంధీ జయంతి అంటున్నారు.. మరొకరేమో జనవరి 26 హాలిడే కాబట్టి ఎంజాయ్ చేసే రోజు అంట.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా చాలా దారుణంగా సమాధానాలు ఇస్తుంటే .. నిజంగా వీళ్ళు మన భారతీయులేనే ?? అనిపిస్తుంది ... ఇదేనా మనం గొప్పగా చూస్తున్న సువిశాల భారతదేశం ... అంతెందుకు ఇది చదువుతున్న మీరే మీ మనసాక్షిని అడగండి.. ఎంతమందికి “గణతంత్ర దినోత్సవం” అంటే ఏంటి ?? అన్న విషయం తెలుసు.. ఒక సినిమాకు ఇచ్చే విలువ కూడా మనం మన దేశానికి ఇవ్వలేకపోవడం శోచనీయం.. స్కూల్స్ లో “గణతంత్ర దినోత్సవం”నాడు జెండా పట్టుకొని, చాక్లెట్స్ తీసుకొని, కాసేపు గీతాలు పాడుకొని, ఏవైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ వుంటే అవి చూసి ఇంటికి రావడమే మనం తెలుసుకున్నాం.. ఆ స్కూల్స్...

JAN25 : జాతీయ ఓటర్ల దినోత్సవం

JAN25 : జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు   💐💐💐💐💐💐💐💐💐💐        భారత దేశంలో ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికలే ప్రధాన గీటురాయి. ఓటు అనే రెండక్షరాలే ప్రజల జీవన స్థితిగతులను నిర్ణయిస్తాయి. విలువలు, నిజాయితీ తో కూడిన రాజకీయ వ్యవస్థను నిర్మించాలన్నా.. అవినీతి, దోపిడీ రాజ్యా లను పారదోలాలన్నా ఓటే వజ్రాయుధం.  రాజకీయ విలువలను ఇనుమడింపజేసేలా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలి. ప్రజాక్షేత్రంలో ఉంటూ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి, సామాజిక అభివృద్ధికి కృషి చేసే నాయకుల్ని ప్రజాత్రినిధులుగా ఎన్నుకోవాలి. రాజకీయాల్లో పేరుకు పోయిన మంచి, చెడును వేరు చేసేలా ఓటర్లు ఓ హంస మాదిరిగా విచక్షణతో వ్యవహరించాల్సిన కీలక సమయమిది. స్వప్రయోజనాలు మాత్రమే కాకుండా విశాల భారతావని ప్రజల ఆకాంక్షలను, దేశ పురోగమనాన్ని దృష్టిలో పెట్టుకొని పవిత్రమైన ఓటు అస్త్రాన్ని సంధించాల్సిన సందర్భమిది స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశకాలు దాటుతున్నా ఇంకా మన రాజకీయ నాయకులు అనాదిగా పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత నినాదాలనే వల్లెవేస్తున్నారు. టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ సామాన్యుడి ...

ఎంత ప్రమాణం తినాలి?

ఎంత ప్రమాణం తినాలి? ‘మితం’గా తినాలి. అంటే శిశువులు, యువకులు, వృద్ధులు తమ వయసును బట్టి తగినంత తిని తదనుగుణంగా వ్యాయామం చెయ్యాలని ఆయుర్వేదం చెబుతోంది. వృత్తిని బట్టి సుకుమారులు, కాయకష్టం చేసేవారు, మానసిక శ్రమకి గురయ్యేవారు తమకు అనుగుణంగా తమ ప్రమాణాల్ని మార్చుకోవాలి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకమైన పోషకాంశాలున్న ఆహారాన్ని సూచించారు. ఇక్కడ మరొక ముఖ్యాంశం ఏమిటంటే ‘అగ్ని’ (అరిగించుకునేశక్తి) బలాన్ని బట్టి ప్రతిఒక్కరూ ఆహార ప్రమాణాన్ని సరిచూసుకోవాలి. మితిమీరి తింటే అజీర్ణవ్యాధి కలుగుతుంది. ఇది ఎన్నో రకాల ఇతర వ్యాధులకు దారి తీస్తుంది. తినవలసినవి తాగవలసినవి ఇవి తినండి: ⇒ మొలకెత్తిన గింజలు (పెసలు నిత్యం లభ్యమౌతాయి) ⇒ నానబెట్టిన వేరుశనగపలుకులు ⇒ పచ్చికొబ్బరి ⇒ గ్రీన్‌సలాడ్లు (ఖీరా, టమాటా, కేరట్, బీట్‌రూట్ మొదలైనవి) తాజా ఫలాలు: బొప్పాయి, జామ, సపోటా, సీతాఫలం, అరటి, బత్తాయి, కమలా, దానిమ్మ, ద్రాక్ష మొదలైనవి. ఎండిన ఫలాలు: ఖర్జూరం, జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్ మొదలైనవి. ⇒ ముడిబియ్యంతో వండిన అన్నం, గోధుమపిండి లేదా మల్టీగ్రైన్ పిండ్లతో చేసిన పుల్కాలు. ⇒ ఆకుకూరలలో తోటకూర చాలా శక్తినిస్తుంది. ...

64 కళలు ( విద్యలు ) అంటే ?

64 కళలు ( విద్యలు ) అంటే ? మన భారతీయ సంస్కృతిలో 64 కళలు ను తెలియజేసే శ్లోకం వేద వేదాంగేతిహాసాగమ, న్యాయకావ్యాలంకార, నాటక, గాన కవిత్వ కామశాస్త్ర శకున, సాముద్రికారత్న పరీక్షాస్వర్ణపరీక్షా శ్వలక్షణ, గజలక్షణ, మల్లవిద్యా, పాకకర్మ దోహళ గంధవాద ధాతువాద ఖనీవాద, రసవాదాగ్నిస్తంభజలస్తంభ వాయుస్తంభ ఖడ్గస్తంష, వశ్యాకర్షణ మోహన విద్వేషణోచ్ఛాటన మారణ కాలవంచన వాణిజ్య, పాశుపాల్య కృష్యా సవకర్మలావుక యుద్ధమృగయా, రతికౌశలా దృశ్యకరణీద్యూతకరణీ చిత్రలోహ పాషాణ మృద్దారు వేణు చర్మాంబరక్రియా చౌర్యౌషధసిద్ధి స్వరవంచనా దృష్టివంచనాంజన, జలప్లవన వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య చతుష్టష్టివిద్యా నిషద్యాయమాన నిరవద్య విద్వజ్ఞాన విద్యోతితే. అర్థము: 1. వేదములు (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అధర్వణవేదము అను నాల్గు) 2. వేదాంగములు ….శిక్షలు, వ్యాకరణము , ఛందస్సు , జ్యోతిషము , నిరుక్తము , కల్పములు అని వేదాంగములు ఆరు శాస్త్రములు 3. ఇతిహాసములు …. రామాయణ,మహాభారత, భాగవతం పురాణాదులు 4. ఆగమశాస్త్రములు …. శైవాగమము ,పాంచరాత్రాగమము , వైఖానసాగమము ,స్మార్తాగమము అని ఆగమములు నాలుగు . 5. న్యాయము …..తర్కశాస్త్రమునకు పేరు 6. కావ్యాల...

ఇది చాలా మంచి వ్యాసం. అందరూ తప్పక చదవాలని మనవి.

ఇది చాలా మంచి వ్యాసం. అందరూ తప్పక చదవాలని మనవి. త్వమేవాహమ్‌ * కన్నతల్లి కడుపులోంచి బయటపడి, తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి, పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా సాగే ప్రస్థానం పేరే నేను ఈ *నేను ప్రాణశక్తి అయిన ఊపిరికి మారుపేరు * ఊపిరి ఉన్నంతదాకా నేను’ అనే భావన కొనసాగుతూనే ఉంటుంది  * జననమరణాల మధ్యకాలంలో సాగే జీవనస్రవంతిలో ఈ నేను ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది ఈ *నేను లోంచే నాది అనే భావన పుడుతుంది! ఈ *నాది లోంచి నావాళ్ళు, నాభార్య, నాపిల్లలు, నాకుటుంబం, నాఆస్తి, నాప్రతిభ, నాప్రజ్ఞ, నాగొప్ప... అనేవీ పుట్టుకొచ్చి చివరికి ఈ నేను అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి,ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి అహం గా ప్రజ్వరిల్లుతుంది * అహం అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ నేను  నేనే సర్వాంతర్యామిని అని విర్రవీగుతుంది. *నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది *పంతాలతో పట్టింపులతో, పగలతో ప్రతీకారాలతో తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది * బాల్య, కౌమార, యౌవన, వార్ధక్య దశలదాకా విస్ఫులింగ తేజంతో...

ఎవరి నుండి ఏం కావాలి?

ఎవరి నుండి ఏం కావాలి? ప్రపంచానికి దూరమవుతామేమోనని నిరంతరం మాట ద్వారా, చేత ద్వారా అస్థిత్వపు పోరాటంలో పెనుగులాడడం.. మనల్ని మనకు కాకుండా చేస్తోంది… విషయమేమిటో అర్థం కావాలంటే… మనిషి సంఘజీవి.. సంఘంతో కలిసి మెలసి ఉంటే సంఘం హర్షిస్తుంది… మనిషికి మానసిక భరోసానూ లభిస్తుంది… ఒక సగటు మనిషిగా మనం సంఘం నుండి ఆశించవలసిన దానికన్నా ఎక్కువ ఆశించడం మొదలెట్టినప్పుడే వ్యర్థప్రయాసలు మొదలవుతాయి… సొసైటీ, మనుషులూ మన జీవితంలో play చెయ్యాల్సిన role చాలా కొద్ది భాగమే… కానీ మనం చాలా expect చేస్తున్నాం…. మనకు అప్రిషియేషన్ సొసైటీ నుండే రావాలీ.. మన ఇగోలు సొసైటీ చేతే శాటిస్‌ఫై చేయబడాలి… మనం కోరుకునే “రాముడు మంచి బాలుడు” ఇమేజ్‌ సొసైటీ నుండే కావాలి…. అప్రిషియేషన్, ఇగో సంతృప్తి, క్లీన్ ఇమేజ్ వంటివి సొసైటీ ద్వారా ఒకప్పుడూ మనుషులకు లభించేవి.. ఇప్పుడూ లభిస్తున్నాయి… అయితే తేడా అల్లా.. ఇప్పుడు మనం చేసే ప్రతీ పనీ ఆ results వస్తాయా లేదా అన్న expectationతో చేస్తున్నాం… అంతకుముందు మనం గుడ్డిగా పని చేసుకుంటూ పోతే అవి ఆటోమేటిక్‌గా వచ్చేవి. ———————- సో మనిషి నిరంతరం సొసైటీ తనకి కొమ్ము కాయాలనుకుంటున్నాడు… తాను చేసే ప్రతీ పనీ గుర్...

ఎక్కడితే స్త్రీలు గౌరవించబడతారో ఆ దేశం సస్యస్యామలంగ వుంటుంది

ఎక్కడితే స్త్రీలు గౌరవించబడతారో ఆ దేశం సస్యస్యామలంగ వుంటుంది . అందుకే ఒక కవి స్త్రీ గురించి ఇలా రాసాడు బ్రతుకు ముల్లబాటలోన్ జతగా స్నేహితురాలవయ్తివి....కన్నీళ్ళు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లెవైతివి....వెనక ముందు రాలినప్పుడు వెన్నుతట్టిన భార్యవైతివి....పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి.....అని అన్నారు. కష్టంలో ముందుండి.... సుఖంలో క్రిందుండి....విజయంలో వెనకుండి ....ఎల్లప్పుడు పక్కనుండేదే స్త్రీ. స్త్రీని పూర్వ కాలంలో అబల అనగా బలం లేనిది అనేవారు. పూర్వం స్త్రీలు ఇంటి పట్టున ఉండి ఇంటి పనులు చేసుకొనేవారు. వివాహితలు ఇంటిని చక్కదిద్దుకుంటూ భర్త, పిల్లల యొక్క బాగోగులు చూసుకొనేవారు. ఆ విధంగా గృహిణి పాత్ర నూరు శాతం వహించేది. యుద్ధానికి వెళ్ళే పురుషులను ఆశీర్వదించేవారు. కాని నేడు స్త్రీలు బయటకు వచ్చి పురుషులతో పోటీగా చదువుతూ, ఉద్యోగాలు చేస్తూ, పురుషుల పరిమితమైన విజయాల్ని సైతం దక్కించుకుంటున్నారు, పూర్తి ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. ఆధునిక కాలంలో ఆడది అబల కాదు 'సబల' అనగా పురుషులతో సమాన స్థాయికి చేరుకోగలదు అని నిరూపించుకుంటున్నారు. నేటి స్త్రీ ఉద్యోగాల వల్ల ఎంతో ఒత్తి...

స్వయం నిర్ణయాత్మక శక్తి ?

రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా స్త్రీలను బలోపేతం చేయడమనే విషయాలు మహిళాసాధికారతలో ప్రస్తావింపబడ్డాయి. స్వశక్తి పై విశ్వాసాన్ని ఆభివృద్ధిపరచడం కూడ సాధికారతలో కలిసి ఉంటుంది.సాధికారత దాదాపుగా కింది అంశాలతో లేదా అదే సామర్ధ్యాలతో ఉంటుంది. అవి స్వయం నిర్ణయాత్మక శక్తిని కల్గి ఉండడం. తగిన సమయంలో తగిన నిర్ణయాన్ని తీసుకోవడానికి అవసరమైన సమాచారం మరియు వనరులు అందుబాటులోకి తెచ్చుకోవడం. అవును/కాదు, ఇదిగాని/ అదిగాని వంటి మాటలు గాక తమ పరిధి మేరకు ఇష్టాలను ఎంచుకోవడం. సాముదాయిక నిర్ణయంలో నిస్సందేహమైన ఖచ్చితత్వాన్ని కలిగి ఉండడం. మార్పుకనుగుణమైన సానుకూల దృక్పథాన్ని పొందగలగడం. వ్యక్తిగతంగాను లేదా సామూహికశక్తిగాగల నైపుణ్యాల సామర్ద్యాలను మెరుగుపరచుకోవడం. ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా ఇతరుల గ్రహణశక్తిని మార్చే సామర్ధ్యాన్ని కల్గి ఉండడం. ఎదుగుదల ప్రక్రియలో, నిరంతర మార్పులకు, స్వయం ప్రేరకంగా కలిసిపోవడం. అనుకూల వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం, అపవాదాల నుంచి అధిగమించడం.

భారత రాజ్యాంగం అంటే

ఓటు వజ్రాయుధం ఒకే ఒక త్రిశూలం ఓటు ఒక గాండీవం* భారత రాజ్యాంగం అంటే 12 షెడ్యూళ్ళు 395 ఆర్టికల్స్ తో ఉన్న ఒక రూల్ బుక్ కాదు రాజ్యాంగం అంటే ఒక నిత్య మార్గదర్శనం అందులోని ప్రతి అధ్యాయం భారతీయులకు భవిష్య నిర్దేశం చేసే ఒక భగవద్గీత భారత రాజ్యాంగం లోని ప్రతి అక్షరం ప్రతి పేజీ పుడమిపై పుట్టిన ప్రతి ఒక్కరికి వేదవాక్కు అందులో ఉన్న ప్రతి వాక్యం ఆసేతు హిమాచలాన్ని ఒక్క తాటిపై నడిపించే శిలాశాసనం రాజ్యాంగంలోని ప్రతి అక్షరం పౌర హక్కులను కాపాడే అస్త్రం భారత దేశ ప్రగతికి బాటలు వేసే ఒక సత్యం ఉద్దేశం ఇలా గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన నాటి నుంచి ఏడు దశాబ్దాలకు పైగా భారతదేశం అలుపెరగకుండా ముందుకు సాగుతూనే ఉంది మొదటి ప్రధాని నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు ముందుకెళ్ళిన ఆపై ఇందిరాగాంధీ గరీబీ హటావో అని నినదించిన పీవీ హయాంలో సంస్కరణలకు తెరలేపిన మన్మోహన్ సింగ్ ఆహారభద్రత ఉపాధిహామీ కల్పించిన నేటి పాలకులు మేకిన్ ఇండియా అంటూ ప్రపంచ యాత్రలు చేస్తున్న అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయింది దేశంలో సంపద పెరుగుతుంటే దాన్ని మించి లాగా పేదరికం కూడా పెరుగుతుంది ఇప్పటికీ దేశంలో 30 శాతం మంది ప్ర...

సుఖం .....సంతోషం

సుఖం .....సంతోషం సుఖంగా వుంటే సంతోషంగా వున్నట్టేనా? సుఖంగా వున్నప్పుడు అంత సంతోషమేనా? సుఖం ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇవ్వగలదా? ఆనందంగా వున్నామంటే సుఖంగావున్నట్టా? మనిషి కోరుకునేది సుఖంనా ? జీవితం ఎప్పుడు సుఖంగా వుంటే సరిపోతుందా? సుఖంగా వుండి ఆనందంగా వున్నామనే భ్రమలో బ్రతుకుతున్నామా? మనం అనుభవించ వలసిన ఆనందాన్ని సుఖం మత్తులో పడి ఇదే ఆనందం కాబోలు అనుకొని అలాగే బ్రతికేస్తున్నామా? చెట్టు కింద బ్రతికే వాళ్ళకి ఒక ఇల్లు, దానిలో ఒక ఫ్యాన్ ,దాని కింద నిద్రపోతే అది వాళ్ళకి సుఖంగా వున్నామని అనిపించొచ్చు ,అలాగే ఫ్యాన్ వున్నా వాళ్ళకి కూలర్ ...కూలర్ వున్నవాళ్ళకి ఏసి సుఖాన్ని ఇస్తుంది ....అల ఒకదాని తర్వాత ఒకటి జీవితం లో సమకూర్చుకుంటూ---- వాటి వెనకాల పడుతూ--- వాటిని సమకూర్చుకొనుటకు --డబ్బు సంపాదనే ధ్యేయంగా ఎంతో విలువైన సమయాన్ని కేవలం మనకు సుఖాన్నిచ్చే కొన్ని వస్తువల కోసం జీవితం లో అనుభవించవలసిన ఆనందాన్ని అంతా పోగొట్టుకుంటున్నాం .... ఇక్కడ డబ్బు సంపాదించటం దానివల్ల వచ్చే సుఖాన్ని వదిలేయమనటం కాదు నా ఉద్దేశం .... మనం రోజు చేసే పనుల్లో సాధించే విజయాలని పూర్తిగా ఆస్వాదిస్తూ ..అ ఆనందాన్ని అనుభవించే టైం మన మనసుక...

అందరూ బీటెక్కులూ, మెడిసిన్లే సదవాలి

అందరూ బీటెక్కులూ, మెడిసిన్లే సదవాలి.. అందరూ సాప్టు"వేర్లు" అయిపోవాలి.. అందరూ DSC లే రాయాలి.. అందరూ bank exams కే prepare అవ్వాలి.. . . . . సివరాకరికి అందరూ ఉద్యోగాలే సెయ్యాలి.. 130 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో 30 కోట్లకు పైగా ఉన్న యువతలో అందరికీ ఉద్యోగాలే రావాలంటే ఎలా వస్తాయి బాస్? 30 కోట్ల మంది విషయం పక్కన పెడదాం.. దాంట్లో 3%... అంటే కోటి మందికి ఉద్యోగాలు వస్తాయా? అది సాధ్యమా? కోటి ఉద్యోగాలను ఇస్తాం అని అప్పుడెప్పుడో2014లో ఇచ్చిన హామీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ తీర్చలేకపోయారు.. అది అనుకున్నంత సులభం కాదు.. దేశస్థాయిలో వద్దు.. మన తెలుగు రాష్ట్రాల వరకూ మాట్లాడుకుందాం.. ప్రభుత్వోద్యోగాల విషయానికి వస్తే, DSC (టీచర్)ఉద్యోగాలు కనీసం 3 ఏళ్లకు ఒకసారి అయినా వస్తున్నాయా? ఇక Group 1,2 ఉద్యోగాల కోసం ఎదురుచూడడం కంటే బుద్ధితక్కువ పని మరొకటి ఉండదు... 2012 group 1 results పైన ఇప్పటికీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.. Bank exams పేరుతో నంద్యాల గురురాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో అక్షరాలా 35,000 మందికి పైగా నిరుద్యోగులు prepare అవుతూనే ఉన్నారు.. అవనిగడ్డలో ఇంకెందరో.. ఇక ప్రై"వేటు...

ఆచార్య శ్రీ బేతావోలు రామబ్రహ్మం గారికి రాష్టప్రతి పురస్కారం

ఆచార్య శ్రీ బేతావోలు రామబ్రహ్మం గారికి రాష్టప్రతి పురస్కారం వచ్చిన సందర్భంగా హార్ధిక శుభాకాంక్షలు. బేతవోలు రామబ్రహ్మం గారు ప్రముఖ తెలుగు పండితులు, అవధాని, రచయిత మరియు విమర్శకులు. బాల్యం / విద్యాభ్యాసం:- బేతావోలు రామబ్రహ్మం గారి ఒక అతి సామాన్య కుటుంబంలో తల్లిదండ్రులు శ్రీ బేతావోలు సత్యనారాయణ మూర్తి రాధ రుక్మిణీ వీరి తండ్రి గారు వృత్తి రీత్యా పశ్చిమ గోదావరి జిల్లా, నల్లజర్ల గ్రామంలో ఆర్&బి గుమస్తాగా పని చేయడం వల్ల వీరు నల్లజర్ల గ్రామంలో 1948, జూన్ 10 న జన్మించారు. కష్టాలే తోడుగా ఈయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. ఆ తర్వాత కొవ్వూరు సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ తెలుగు చదివారు. తరువాత నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య తూమాటి దొణప్ప పర్యవేక్షణలో తెలుగు వ్యాకరణాలపై సంస్కృత వ్యాకరణాల ప్రభావం అనే అంశంపై పి.హెచ్.డి చేశారు. ఉద్యోగం:- మొట్టమొదట ఇతడు గుంటూరులోని కెవికె సంస్కృత కళాశాలలో ఉపన్యాసకులుగా చేరారు. ఈయన బోధన విద్యార్థులకే కాక సహ అధ్యాపకులైన మల్లంపల్లి వీరేశ్వరశర్మ , కోగంటి సీతారామచార్యులు, జమ్మలమడక మాధవరామశర్మ వంటి పండితులను కూడా ఆకర్షించేది...

ఆధ్యాత్మిక పరిపక్వత ఏమిటి?

🌷ఆధ్యాత్మిక                                                                                                                   పరిపక్వత🌷 🌴🌴🌴🌴🌴🌴 ఆధ్యాత్మిక పరిపక్వత ఏమిటి? 🌴🌴🌴🌴🌴🌴🌴 🌷1. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే      మీరు ఇతరులను మార్చాలనే ప్రయత్నం  మాని మీరు మారడంపై దృష్టి పెట్టడం . 🌷2. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే   మీరు ప్రజలను వారు ఉన్నవిధంగా అంగీకరించడం . 🌷3. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే ప్రతిఒక్కరు చేసేది వారి స్వంత దృష్టికోణంలో సరియైనదేనని భావించడాన్ని నేర్చుకోవడం . 🌷4. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే మీరు  జరుగనున్నది సంఘర్షణ పడక జరగనివ్వడాన్ని నేర్చుకోవడం . 🌷5. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే  మీరు ఇతరులతో ...

ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో

ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో సంసారపు గోడలమధ్య ఎక్కడ భాగాలకింద ప్రపంచం విడిపోలేదో ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో ఎక్కడ అలసట నెరగనిశ్రమ తనబాహువుల్ని పరిపూర్ణతవైపు జాస్తుందో ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా వుంటుందో ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ కార్యాలలోకీ నీచే నడపబడుతుందో ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రీ నాదేశాన్ని మేల్కొలుపు. PAKALAPATI AMARNADH

ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుండో

 ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుండో  ఎక్కడ మనిషి సగర్వంగా తలెత్తుకొని తిరగగలడో,                                                                    ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలైపోయి మగ్గిపోదో,                                          ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపాదో,                            ...

విద్యా దదాతి వినయం, వినయాద్వాతి పాత్రతాం

విద్యా దదాతి వినయం, వినయాద్వాతి పాత్రతాం । పాత్రత్వాద్ధన మాప్నోతి ధనాద్ధర్మం తతస్సుఖమ్‌॥ విద్యతో వినయం చేకూరుతుంది. ఆ వినయంతో అర్హత (పాత్రత) లభిస్తుంది. పాత్రత వల్ల ఎలాగూ ధనం సమకూరుతుంది. ఆ ధనములోంచి కొంత దానం చేసి సుఖాన్ని పొందవచ్చు. ఇక్కడ కేవలం విద్య యొక్క ప్రాముఖ్యతని మాత్రమే వివరించలేదు. దానివలన వ్యక్తిత్వం బలపడుతుందనీ, మనిషి సామర్థ్యం మెరుగుపడుతుందనీ, భౌతికమైన సంపదనీ పొందగలుగుతామనీ, పదిమందికీ ఉపయోగపడేలా దానమూ చేయగలుగుతామని చెబుతున్నాడు కవి. అంటే ఇక్కడ సుఖం అనేది ఒక్క భౌతికంగానే కాదు సర్వతోముఖంగా ఉంది. విద్యతో ఇహమూ పరమూ సిద్ధిస్తాయని ఈ పద్యం చెబుతోంది.   PAKALAPATI AMARNADH

మాట ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు Inspirational Speech by Amarnath

మాట ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు Inspirational Speech by Amarnath